హీరో అజిత్‌ సినిమా షూటింగ్‌లో విషాదం.. గుండెపోటుతో ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి!

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తమిళ ఆర్ట్‌ డైరెక్టర్‌ మిలన్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. స్టార్‌ నటుడు అజిత్‌ కుమార్‌ హీరోగా నటిస్తోన్న కొత్త మువీ 'విడాముయార్చి' (Vidaaa Muyarchi). ఏకే 62గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం (అక్టోబర్‌ 15) అజిత్‌ కుమార్‌ అండ్‌ టీం అజర్‌బైజాన్‌లో షూటింగ్‌ జరుగుతుండగా మిలన్‌కు గుండె పోటు వచ్చింది. దీంతో చిత్ర బృందం హుటాహుటీన..

హీరో అజిత్‌ సినిమా షూటింగ్‌లో విషాదం.. గుండెపోటుతో ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి!
Art Director Milan
Follow us

|

Updated on: Oct 15, 2023 | 4:34 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తమిళ ఆర్ట్‌ డైరెక్టర్‌ మిలన్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. స్టార్‌ నటుడు అజిత్‌ కుమార్‌ హీరోగా నటిస్తోన్న కొత్త మువీ ‘విడాముయార్చి’ (Vidaaa Muyarchi). ఏకే 62గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం (అక్టోబర్‌ 15) అజిత్‌ కుమార్‌ అండ్‌ టీం అజర్‌బైజాన్‌లో షూటింగ్‌ జరుగుతుండగా మిలన్‌కు గుండె పోటు వచ్చింది. దీంతో చిత్ర బృందం హుటాహుటీన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే ఆయన మార్గం మధ్యలోనే కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది.

కాగా ఆర్ట్‌ డైరెక్టర్‌ మిలన్‌ గతేడాది కూడా అజిత్‌తో కలిసి పనిచేశారు. తమిళంలో వచ్చిన తునివు సినిమాకు అజిత్‌, మిలన్‌ కలిసి పనిచేశారు. హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘కంగువ’ సినిమాకు కూడా మిలన్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌. మంచి టాలెంటె కలిగిన ఆర్ట్‌ డైరెక్టర్‌ మిలన్‌ ఉన్నట్లుండి హఠాన్మరణం చెందడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మిలన్ ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హీరో అజిత్‌ నటిస్తోన్న ‘విడాముయార్చి’ మువీ షూటింగ్‌ ఇటీవలే అజర్‌బైజాన్‌లో ఇటీవల ప్రారంభమైంది. ఈ మూవీ కోసం అజిత్‌ కుమార్‌ 110 రోజులు కాల్షీట్లు ఇచ్చినట్లు ఇన్‌సైడ్‌ టాక్‌. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మువీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ ఈ మువీని నిర్మిస్తోంది. అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ షూటింగ్‌ ప్రారంభమైన రోజుల వ్యవధిలోనే ఆర్ట్‌ డైరెక్టర్‌ మిలన్‌ మరణించడంతో చిత్ర యూనిట్‌ శోకసంద్రంలో మునిగిపోయింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.