Snake Bite: ప్రముఖ సినీ రచయితకు పాముకాటు.. వర్షంలో చిక్కుకున్న కుక్కలను కాపాడబోయి..

ఆస్కార్ 2024కు మలయాళ మువీ '2018' ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దక్షణాదిన విడుదలైన సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు కథా రచయిత (స్ర్కీన్‌ రైటర్‌)గా పనిచేసిన అఖిల్‌ పి ధర్మాజన్‌ పాముకాటుతో ఆదివారం (అక్టోబర్ 15)  ఆసుపత్రిలో చేరాడు. కొత్త సినిమా స్క్రిప్ట్‌ రాసేందుకు కేరళలోని తిరువనంతపురంకి వెళ్లాడు. అక్కడ శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంలో ఆయన చిక్కుకున్నాడు. అఖిల్‌ నివాసం ఉంటోన్న ప్రాంతం ఆనకట్టకు సమీపంలో..

Snake Bite: ప్రముఖ సినీ రచయితకు పాముకాటు.. వర్షంలో చిక్కుకున్న కుక్కలను కాపాడబోయి..
Screen Writer Akhil P Dharmajan
Follow us

|

Updated on: Oct 15, 2023 | 5:15 PM

తిరువనంతపురం, అక్టోబర్‌ 15: ఆస్కార్ 2024కు మలయాళ మువీ ‘2018’ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దక్షణాదిన విడుదలైన సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు కథా రచయిత (స్ర్కీన్‌ రైటర్‌)గా పనిచేసిన అఖిల్‌ పి ధర్మాజన్‌ పాముకాటుతో ఆదివారం (అక్టోబర్ 15)  ఆసుపత్రిలో చేరాడు. కొత్త సినిమా స్క్రిప్ట్‌ రాసేందుకు కేరళలోని తిరువనంతపురంకి వెళ్లాడు. అక్కడ శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంలో ఆయన చిక్కుకున్నాడు. అఖిల్‌ నివాసం ఉంటోన్న ప్రాంతం ఆనకట్టకు సమీపంలో ఉండటంతో వర్షాలకు భారీగా అక్కడికి వరద నీళ్లు చేరింది. దీంతో అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో వర్షం నీళ్లలో చిక్కుకున్న కొన్ని కుక్కలు అతనికి కనిపించాయి. వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా నీళ్లలో ఉన్న పాము కాటు వేసింది. కాటు వేసింది నాగుపాముగా అఖిల్‌ గుర్తించాడు. అది నీళ్లలో కాటు వేసినందువల్ల ప్రాణాంతకం కాలేదు.

ప్రస్తుతం రైటర్‌ అఖిల్‌ తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉన్నారు. భయపడాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉందని అఖిల్ మీడియాకు తెలిపాడు. కాగా తిరువనంతపురంలో శనివారం రాత్రి మొదలైన వర్షం ఆదివారం ఉదయం వరకు కూడా జోరుగా కురుస్తూనే ఉంది. పట్టణ, కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో వర్షాలు జోరందుకున్నాయి. మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో పలు చోట్ల నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మనక్కాడ్, ఉల్లూరు, వెల్లాయని ప్రాంతాల్లో ఇళ్లు నీటమునిగాయి. తిరువనంతపురం నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లోని పలు ఇళ్లు జలమయమయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీళ్లు చేరాయి. కన్నన్మూలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద పోటెత్తింది. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. జూడ్ ఆంటోని దర్శకత్వం వహించిన 2018 మలయాళ చిత్రానికి నవలా రచయిత అఖిల్ పి ధర్మజన్ కథా రచయితగా పనిచేశారు. ఈ చిత్రం ఇటీవలే మన దేశం నుంచి ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. యువ రచయిత అఖిల్ ఓజో బోర్డ్, మెర్క్యురీ ఐలాండ్, రామ్ కేర్ ఆఫ్ ఆనంది కేరళలో ప్రసిద్ధ నవలా రచయితలుగా పేరుగాంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.