Producer Ravinder: ‘జైళ్లో ఉన్నప్పుడు బాత్రూంకి కూడా వెళ్లలేకపోయాను.. నా భార్య నిజంగానే మహాలక్ష్మీ’

తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ గత ఏడాదిన్నర కాలం నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. టీవీ నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం నుంచి రవీందర్‌ గురించిన ప్రతి వార్త వైరల్‌ అవుతోంది. డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్‌ను పెళ్లి చేసుకుందని తెగ ట్రోల్‌ చేశారు. అలాగే రవీందర్‌ను కూడా పలువురు బాడీ షేమింగ్‌ చేశారు. తాజాగా ఓ ఫ్రాడ్‌ కేసులో అరెస్ట్ అయిన నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ఇటీవల బెయిల్‌ మీద విడుదలైన సంగతి తెలిసిందే. జైలులో ఉన్న సమయంలో..

Srilakshmi C

|

Updated on: Oct 15, 2023 | 2:56 PM

తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ గత ఏడాదిన్నర కాలం నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. టీవీ నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం నుంచి రవీందర్‌ గురించిన ప్రతి వార్త వైరల్‌ అవుతోంది. డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్‌ను పెళ్లి చేసుకుందని తెగ ట్రోల్‌ చేశారు. అలాగే రవీందర్‌ను కూడా పలువురు బాడీ షేమింగ్‌ చేశారు. తాజాగా ఓ ఫ్రాడ్‌ కేసులో అరెస్ట్ అయిన నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ఇటీవల బెయిల్‌ మీద విడుదలైన సంగతి తెలిసిందే. జైలులో ఉన్న సమయంలో రవీందర్‌ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డారు.

1 / 5
జైలు నుంచి వచ్చిన తర్వాత రవీందర్ చుట్టూ అల్లుకొన్న వివాదాలు, గాసిప్స్‌పై ఆయన వివరణ ఇచ్చారు. రవీందర్, మహాలక్ష్మిల మధ్య సమస్యలు ఉన్నాయని, త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు , భర్త అరెస్ట్ మహాలక్ష్మిని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. రవీందర్ జైల్లో ఉన్నప్పుడు కూడా మహాలక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేదని, భర్త జైల్లో ఉన్నా భార్య ఇంత సంతోషంగా ఉండటం విడ్డూరంగా ఉందంటూ పలువురు ఆమె షేర్ చేసిన ఫోటోలకు ట్రోల్‌ చేశారు. వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవీందర్‌ మాట్లాడుతూ..

2 / 5
కష్టకాలంలో నా కుటుంబ సభ్యుల సహకారం, నా తల్లి ప్రార్థన వల్లనే నేను బయటకు రాగలిగాను. నా భార్య నిజమైన మహాలక్ష్మి. మహాలక్ష్మిని నా నుంచి ఎవరూ వేరు చేయలేరు. ఈ 30 రోజులు నన్ను చూడకుండా ఉండలేక మహాలక్ష్మి ఎంతో ఇబ్బంది పడిందన్నారు. జైల్లో ఉన్న సమయంలో బాత్రూంకి కూడా వెళ్లలేక కష్టపడ్డానని రవీందర్‌ జైల్లో గడిపిన రోజులను గుర్తుచేసుకుని బాధపడ్డారు.

3 / 5
ఉదయానే బాత్రూమ్‌కి వెళ్లడం నాకు చాలా కష్టంగా అనిపించింది. అక్కడ వెస్ట్రన్‌ టాయిలెట్‌ లేకపోవడంతో నరకం అనుభవించాను. ఓ బ్లాక్‌లో వెస్ట్రన్ టాయిలెట్ ఉండటంతో.. ఆ టాయిలెట్‌ని వాడుకోవడానికి ఓ జైలు అధికారి  సహకరించాడు' అని రవీందర్ చెప్పారు.

4 / 5
కాగా నిర్మాత రవీందర్‌ రూ.16 కోట్లు వసూలు చేసిన కేసులో రవీందర్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తి  మోసం చేసి తన వద్ద డబ్బు వసూలు చేశాడంటూ రవీందరపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రవీందర్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఆయన తాను నిర్ధోషినని, త్వరలోనే నిజం బయటపెడతానని చెప్పుకొచ్చారు. కాగా రవీందర్ చంద్రశేఖరన్ లిబ్రా ప్రొడక్షన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించారు.

5 / 5
Follow us