- Telugu News Photo Gallery Cinema photos Actress Taapsee Pannu Hopes on Dream Project Dhamki Movie Telugu Actress Photos
Taapsee Pannu: ఆశలన్ని డంకీ మీదే పెట్టుకున్న హాట్ బ్యూటీ తాప్సీ.. ఏంటా ప్రాజెక్ట్..?
సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యూటీ తాప్సీ. బీ టౌన్‌లో అడుగు పెట్టిన కొత్తలో వరుస సక్సెస్‌లో మంచి ఫామ్‌లో కనిపించిన ఈ బ్యూటీ.. ఈ మధ్య ఇబ్బంది పడుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తరువాత అసలు కనిపించటమే మానేశారు ఈ బ్యూటీ. కోవిడ్‌కు ముందు వరకు మంచి ఫామ్‌లో కనిపించిన తాప్సీ.. ఆఫ్టర్ కోవిడ్ కెరీర్ విషయంలో తడబడుతున్నారు. ఈ బ్యూటీ నటించిన సినిమాల చాలా వరకు ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి.
Updated on: Oct 20, 2023 | 8:35 AM

సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యూటీ తాప్సీ. బీ టౌన్‌లో అడుగు పెట్టిన కొత్తలో వరుస సక్సెస్‌లో మంచి ఫామ్‌లో కనిపించిన ఈ బ్యూటీ.. ఈ మధ్య ఇబ్బంది పడుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తరువాత అసలు కనిపించటమే మానేశారు ఈ బ్యూటీ.

కోవిడ్‌కు ముందు వరకు మంచి ఫామ్‌లో కనిపించిన తాప్సీ... ఆఫ్టర్ కోవిడ్ కెరీర్ విషయంలో తడబడుతున్నారు. ఈ బ్యూటీ నటించిన సినిమాల చాలా వరకు ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఒకటి రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినా అవి పెద్దగా వర్కవుట్ కావటం లేదు.

దీంతో తాప్సీ కెరీర్ క్లైమాక్స్‌కు వచ్చినట్టేనా అన్న డిస్కషన్ మొదలైంది. కోవిడ్‌కు ముందు బద్ల, మిషన్ మంగల్, తప్పడ్ లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించారు తాప్సీ. కరోనా టైమ్‌లో థియేటర్లకు బ్రేక్ పడటంతో హసీన్ దిల్రుబా సినిమాతో డిజటల్ ఆడియన్స్ ముందుకు వచ్చి సక్సెస్ సాధించారు.

ఓటీటీ రిలీజ్ అయినా... ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావటంతో అమ్మడి కెరీర్ ఫుల్ జోష్‌లో కనిపించింది. అదే జోరులో రష్మిరాకెట్, లూప్ లపెట్టా లాంటి డిఫరెంట్ సినిమాలు చేశారు తాప్సీ. కానీ ఆ సినిమాలేవి అనుకన్న స్థాయిలో మెప్పించకపోవటంతో తాప్సీ కెరీర్ గాడి తప్పింది.

ఆ తరువాత మిషన్ ఇంపాజిబుల్, శభాస్ మిథు, దొబారా, బ్లర్ లాంటి సినిమాలు థియేటర్లలోనే రిలీజ్ అయినా... అవి కూడా సక్సెస్ సాధించలేకపోయాయి. వరుస ఫెయిల్యూర్స్‌తో డీలా పడిపోయిన తాప్సీ, మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు.

ప్రజెంట్ ఆశలన్ని అప్ కమింగ్ మూవీ డంకీ మీదే పెట్టుకున్నారు. డ్రీమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో డంకీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా గ్యారెంటీ హిట్ అన్న కాన్ఫిడెన్స్ ఉండటంతో తిరిగి ఫామ్‌లోకి రావచ్చని ఆశపడుతున్నారు. మరి ఈ సినిమా అయినా తాప్సీ ఆశలు నెరవేరుస్తుందో లేదో చూడాలి.




