AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel-Hamas Conflict: హమాస్‌ ఉగ్రవాదుల చెరలో బందీలుగా 199 మంది ఇజ్రాయెలీలు

ఇజ్రాయెల్‌పై హమాస్‌ల దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ మారణహోమం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ దాడిలో పాలస్తీనాకు చెందిన హమాస్‌ ఉగ్రవాదుల చెరలో సుమారు 199 మంది ఇజ్రాయెలీయులు బంధీలుగా ఉన్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ మేరకు మిలిట‌రీ ప్రతినిధి డానియ‌ల్ హ‌గారే మీడియాకు తెలిపారు. తొలుత 155 మందిని కిడ్నాప్‌ చేసినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంఖ్యను 199కి పెంచింది. హమాస్‌ చేతిలో బంధీలుగా..

Israel-Hamas Conflict: హమాస్‌ ఉగ్రవాదుల చెరలో బందీలుగా 199 మంది ఇజ్రాయెలీలు
Israel Hamas War
Srilakshmi C
|

Updated on: Oct 16, 2023 | 4:31 PM

Share

జెరూసలేం, అక్టోబర్ 16: ఇజ్రాయెల్‌పై హమాస్‌ల దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 7న ప్రారంభమైన ఈ మారణహోమం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ దాడిలో పాలస్తీనాకు చెందిన హమాస్‌ ఉగ్రవాదుల చెరలో సుమారు 199 మంది ఇజ్రాయెలీయులు బంధీలుగా ఉన్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ మేరకు మిలిట‌రీ ప్రతినిధి డానియ‌ల్ హ‌గారే మీడియాకు తెలిపారు. తొలుత 155 మందిని కిడ్నాప్‌ చేసినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంఖ్యను 199కి పెంచింది. హమాస్‌ చేతిలో బంధీలుగా చిక్కుకున్న వారిలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు.

ఇజ్రాయెల్‌ మిలిటెంట్ల సరిహద్దు దాడుల్లో 20 నిమిషాల వ్యవధిలోనే గాజా ప్రాంతం నుంచి హమాస్ ఉగ్రవాదులు 5 వేల రాకెట్లను ఫైర్ చేశారు. ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. పసిపిల్లల్ని తలలు నరికి హత మార్చారు. ఈ క్రమంలో ఇజ్రాయిల్ నుంచి అనేక మందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అలా వారు మొత్తం 199 మందిని బందీలుగా తీసుకుపోయినట్లు సైనిక ప్రతినిధి డేనియల్‌ హగారి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం వీరిని విడిపించేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఏర్పాట్లు చేస్తోంది. గతంలో 155 మంది బందీలుగా ఉన్నారని భావించినప్పటికీ తాజా విచారణలో ఆ సంఖ్య 199కి చేరినట్లు వెల్లడించింది.

హమాస్‌ దాడి అనంతరం ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో 1400లకు పైగా పౌరులు మరణించారు. 7 రోజుల పాటు జరిగిన దాడుల్లో ఇరు వైపులా 3 వేలకు పైగా ప్రాణనష్టం జరిగింది. మృతదేహాలను పాతి పెట్టేందుకు స్థలంలేక ఐస్‌ క్రీం ట్రక్కుల్లో భద్రపరుస్తున్నారు. ఆసుపత్రుల్లోని మార్చురీలకు చేర్చడం కూడా వారికి అసాధ్యంగా మారింది. దీంతో అక్కడి ఐస్‌ క్రీం ట్రక్కులు ప్రస్తుతం శవాగారాలుగా మారాయి. మరణాల సంఖ్య పెరుతుండటంతో మృతదేహాలను నిల్వ చేయడం వారికి సవాలుగా మారింది. ఇప్పటికే శ్మశాన వాటికలన్నీ నిండిపోవడంతో సామూహిక సమాధులు ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి