ఓ దేవుడో..! నరకంలో కూడా ఇంత భయంకరమైన శిక్ష పడదు…కిమ్ జాంగ్ తన జనరల్‌ని ఇలా..

మనిషిగా ఉన్న వ్యక్తి మనుషులపై ఇంత క్రూరత్వం ఎలా చూపిస్తారనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. కిమ్ జాంగ్ క్రూరత్వానికి సంబంధించిన వార్తలు ప్రతిరోజూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి గుండెలు పిండేసే వార్త బయటకు వచ్చింది.. కిమ్ ఓ జనరల్‌కి ఇంత దారుణమైన శిక్ష విధించాడు.. ఈ విషయం తెలిసి అందరూ షాక్‌కు గురవుతున్నారు.

ఓ దేవుడో..! నరకంలో కూడా ఇంత భయంకరమైన శిక్ష పడదు...కిమ్ జాంగ్ తన జనరల్‌ని ఇలా..
Kim Jong Un
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 16, 2023 | 2:46 PM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ తన పరిపాలనా విధానం, వింత శిక్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంటాడు. ఉత్తర కొరియా ప్రజలే కాదు, యావత్ ప్రపంచం కిమ్‌ విధించే భయంకరమైన శిక్షకు భయపడుతోంది. మనిషిగా ఉన్న వ్యక్తి మనుషులపై ఇంత క్రూరత్వం ఎలా చూపిస్తారనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. కిమ్ జాంగ్ క్రూరత్వానికి సంబంధించిన వార్తలు ప్రతిరోజూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి గుండెలు పిండేసే వార్త బయటకు వచ్చింది.. కిమ్ ఓ జనరల్‌కి ఇంత దారుణమైన శిక్ష విధించాడు.. ఈ విషయం తెలిసి అందరూ షాక్‌కు గురవుతున్నారు.

నివేదిక ప్రకారం, జనరల్‌పై తీవ్రమైన ఆరోపణ జరిగింది. తిరుగుబాటుకు పథకం పన్నారని చెబుతున్నారు. కిమ్ జోంగ్-ఉన్ తన ప్లాన్ గురించి తెలుసుకున్నాడు. ప్రతిసారీ ఎలా జరిగిందో, ఈసారి కూడా అదే జరగడం కనిపించింది. ఇప్పటి వరకు, కిమ్ జోంగ్ ఎంత పెద్ద వ్యక్తి అయినా దేశద్రోహులను ఒక్కసారి కూడా విడిచిపెట్టలేదు. తిరుగుబాటుకు ప్లాన్ చేస్తున్న ఈ జనరల్‌కు కిమ్ చాలా బాధాకరమైన మరణశిక్ష విధించాడు, ఇది తెలిసిన తర్వాత మీ ఆత్మ వణుకుతుంది.

అయితే, సదరు బాధిత జనరల్ పేరు, గుర్తింపును వెల్లడించలేదు. కానీ, నియంతను అధికారం నుండి తొలగించడానికి తిరుగుబాటుకు కుట్ర పన్నుతున్నాడని ఆరోపించినప్పుడు, కిమ్ కోపంగా ఉన్నాడు. ఆ వ్యక్తి కుటుంబం గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదన్నంత కోపం వచ్చింది. దాంతో కిమ్ ర్యాంగ్‌సాంగ్ రెసిడెన్స్ లోపల ఒక పెద్ద ఫిష్ ట్యాంక్ ఏర్పాటు చేయించాడు. ఈ భారీ అక్వేరియం బ్రెజిల్ నుండి దిగుమతి చేసుకున్న వందలాది పిరాన్హా చేపలతో నింపాడు. మందుగా కిమ్ ఆ జనరల్ చేతులు, తలను కత్తితో నరికి శరీరం నుండి వేరు చేశాడు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని ప్రమాదకరమైన చేపలతో నిండిన ట్యాంక్‌లో విసిరేశాడు. జనరల్ ఒళ్లంత తీవ్ర గాయాలతో అతను బాధతో మరణించాడు.

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం, ఉత్తర కొరియా నియంత కిమ్‌కు 1977 జేమ్స్ బాండ్ చిత్రం ‘ది స్పై హూ లవ్డ్ మీ’ నుండి దేశద్రోహులకు అలాంటి మరణాన్ని ఇవ్వాలనే ఆలోచన వచ్చిందట. ఈ చిత్రంలో, విలన్ కార్ల్ స్ట్రోమ్బెర్గ్ తన శత్రువులను పెద్ద సంఖ్యలో ప్రమాదకరమైన సొరచేపలు ఉన్న ట్యాంక్‌లోకి విసిరి చంపాడు. పిరాన్హా చేపల దంతాలు చాలా పదునైనవి. ఈ చేపలు కొన్ని నిమిషాల్లో మానవ శరీరాలను ముక్కలు చేసి మాంసాన్ని తినగలవు. కిమ్‌కు సంబంధించి, 2011లో అధికారం చేపట్టినప్పటి నుంచి మొత్తం 16 మంది సీనియర్‌ అధికారులకు ఈ తరహా మరణశిక్ష విధించినట్లు సమాచారం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..