AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్లజుట్టు, చుండ్రు సమస్యకు పరిష్కారం కాఫీ పొడి..! ఇలా వాడితే కేశసౌందర్యంలో తగ్గేదేలే..

కేశ సౌందర్యానికి సహజ మార్గాల కోసం చూస్తున్నట్లయితే మీ కోసం కొన్ని కాఫీ మాస్క్‌ల ఉపయోగం గురించిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..ఇవి మీ జుట్టు, స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీ తలకు కాఫీ పౌడర్‌ మాస్క్‌, హెయిర్‌ వాష్‌తో ఎలా ఫలితం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

తెల్లజుట్టు, చుండ్రు సమస్యకు పరిష్కారం కాఫీ పొడి..! ఇలా వాడితే కేశసౌందర్యంలో తగ్గేదేలే..
Coffee Mask For Hair
Jyothi Gadda
|

Updated on: Oct 16, 2023 | 1:25 PM

Share

ప్రతిరోజూ ఉదయాన్నే చాలామంది తాగే కాఫీ వల్ల మీ జుట్టుకు అపారమైన ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా? అవును, చుండ్రు, తెల్ల జుట్టు వంటి సమస్యలను నయం చేయడంలో కాఫీ సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా అందమైన జుట్టు కావాలని కోరుకుంటున్నట్టయితే..? కేశ సౌందర్యానికి సహజ మార్గాల కోసం చూస్తున్నట్లయితే మీ కోసం కొన్ని కాఫీ మాస్క్‌ల ఉపయోగం గురించిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..ఇవి మీ జుట్టు, స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీ తలకు కాఫీ పౌడర్‌ మాస్క్‌, హెయిర్‌ వాష్‌తో ఎలా ఫలితం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

మీ కేశ సౌందర్యాన్ని పెంచుకోవటం కోసం మంచి కాఫీ మాస్క్ తయారీ కోసం పావు కప్పు కాఫీ పొడిని వేడి నీటిలో వేసి బాగా కలపాలి. తర్వాత చల్లారాక తలకు పట్టించి మృదువుగా మసాజ్ చేయాలి. జుట్టు మూలాల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. సుమారు 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేసి.. ఆ తర్వాత జుట్టును శుభ్రంగా కడిగేయాలి.

చుండ్రు సమస్య కోసం కాఫీ..

ఇవి కూడా చదవండి

మీరు ముందుగా షాంపూతో మీ జుట్టును కడగాలి. ఆ తర్వాత కాఫీని బ్రూ చేసి చల్లారనిచ్చి తల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. సుమారు 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత శుభ్రంగా వాష్‌ చేసుకుంటే సరిపోతుంది.

కాఫీ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి

* 2 టేబుల్ స్పూన్ కాఫీ పొడి, * 1 చెంచా తేనె * 1 చెంచా కొబ్బరి నూనె

ఈ మూడు పదార్థాలను కలపండి. తర్వాత ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు మూలాల నుండి చివర్ల వరకు అప్లై చేసి 20-30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. అప్పుడు జుట్టు కడగాలి. ఇలా చేయడం వల్ల సిల్కీ హెయిర్ పొందుతారు.

కాఫీ హెయిర్ మాస్క్ కోసం

2 టేబుల్ స్పూన్ కాఫీ పొడి, * 1 చెంచా తేనె * 1 చెంచా కొబ్బరి నూనె

ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్‌ చేసిన తర్వాత ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు మూలాల నుండి చివర్ల వరకు అప్లై చేసి 20-30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత శుభ్రంగా కడిగేయాలి ఇలా చేయడం వల్ల సిల్కీ హెయిర్ పొందుతారు.

కాఫీ, కొబ్బరి నూనె హెయిర్‌ మాస్క్

కొబ్బరి నూనెతో తయారుచేసిన కాఫీ పౌడర్ తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కొబ్బరి నూనె స్కాల్ప్‌లోని తేమను, కాఫీలోని కెఫిన్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

ఎలా తయారు చేయాలి: ఈ మాస్క్‌ను సిద్ధం చేయడానికి, పావు కప్పు కొబ్బరి నూనెను తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి, 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి స్మూత్‌గా మర్థన చేయాలి.. ఆ తర్వాత శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి.. హెయిర్ వాష్ ముందు వారానికి ఒకసారి ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..