AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3 Durgamatha: చంద్రయాన్-3లో దుర్గా మాత.. అందుకే ఈ సారి ఫేమస్..! ఎక్కడో తెలుసా…

Srikakulam: అందుకే చిన్నారుల్లో అంతరిక్ష పరిశోధనల పట్ల అవగాహన కల్పించటంతో పాటు భక్తి భావన పెంపొందించే ఉద్దేశంతో ఇటీవల జరిగిన గణేష్ ఉత్సవాలలో చంద్రయాన్ 3 సెట్టుతో ఏర్పాటు చేసిన మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే ఇపుడు దేవి నవరాత్రి ఉత్సవాలలోనూ అదే నమూనా మండపాలు ప్రజల ఆదరణను పొందుతున్నాయి.

Chandrayaan-3 Durgamatha: చంద్రయాన్-3లో దుర్గా మాత.. అందుకే ఈ సారి ఫేమస్..! ఎక్కడో తెలుసా...
Chandrayaan 3 Durgamatha
S Srinivasa Rao
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 16, 2023 | 11:58 AM

Share

శ్రీకాకుళం జిల్లా, అక్టోబర్16; దేవి నవరాత్రుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ దుర్గాదేవి అమ్మవారు కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఊరు ఊరా.. వాడవాడలా యువకులు, స్థానికులు దేవి విగ్రహాలు నెలకొల్పి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఇతరచోట్ల కంటే భిన్నంగా ఉండాలన్న సంకల్పంతో కొందరు వినూత్నంగా మండపాలు నెలకొల్పి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ కోవలోనే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ఏర్పాటు చేసిన చంద్రయాన్ – 3 నవదుర్గ మండపం అందరినీ ఆకట్టుకుంటోంది.

బయటకు చంద్రయాన్ – 3 సెట్టు కనిపిస్తుంది. లోపలకు వెళ్లి చూస్తే అందులో ఆది పరాశక్తి కొలువై ఉంటుంది. చంద్రయాన్ నవ దుర్గ మండపాన్ని చూసేందుకు ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.

నేతాజీ యువజన సంఘ సభ్యులు మాట్లాడుతూ… ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవించే విధంగా నేడు ఇస్రో అనేక విజయవంతమైన ప్రయోగాలు చేపడుతోందని.. ఈ గొప్పతనం అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఇలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతరిక్ష పరిశోధనలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు చిన్నారుల్లో భక్తితో పాటు విషయ పరిజ్ఞానం పెంపొందించాలన్నదే తమ లక్ష్యమని గ్రామయువకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా భారత దేశం అనగానే సైన్స్, సంప్రదాయం,ఆధ్యాత్మికత మితమై ఉంటుంది. గుమ్మానికి పసుపురాయటం సంప్రదాయం. పసుపు క్రిమి సంహారిణి కావటం ఆలా రాయటం వల్ల ఇంటి లోపలకు క్రిములు రాకుండా రక్షణగా నిలుస్తుందని సైన్స్ చెబుతుంది. శాస్త్ర సాంకేతిక రంగం ఎంతగానో అభివృద్ధి చెందుతున్న నేటికీ ఉపగ్రహాలను లాంచ్ చేసే ముందు ఇస్రో చైర్ మన్ ఆలయాలను దర్శించి పూజలు చేయటం సంప్రదాయంగా వస్తుంది. అందుకే చిన్నారుల్లో అంతరిక్ష పరిశోధనల పట్ల అవగాహన కల్పించటంతో పాటు భక్తి భావన పెంపొందించే ఉద్దేశంతో ఇటీవల జరిగిన గణేష్ ఉత్సవాలలో చంద్రయాన్ 3 సెట్టుతో ఏర్పాటు చేసిన మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే ఇపుడు దేవి నవరాత్రి ఉత్సవాలలోనూ అదే నమూనా మండపాలు ప్రజల ఆదరణను పొందుతున్నాయి.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..