CM YS Jagan: విశాఖకు సీఎం జగన్.. ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
విశాఖ నుంచి త్వరలోనే పాలన కొనసాగిస్తానని చెప్పిన ఏపీ సీఎం జగన్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇవాళ విశాఖ, అనకాపల్లిలో జిల్లాలో పర్యటించనున్నారు. విశాఖలో ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవనాలను, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్ఎస్‌పీఎల్ యూనిట్ 2ను జగన్ ప్రారంభిస్తారు.
విశాఖపట్నం, అక్టోబర్ 16: విశాఖ నుంచి త్వరలోనే పాలన కొనసాగిస్తానని చెప్పిన ఏపీ సీఎం జగన్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇవాళ విశాఖ, అనకాపల్లిలో జిల్లాలో పర్యటించనున్నారు. విశాఖలో ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని, లారస్ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవనాలను, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్ఎస్‌పీఎల్ యూనిట్ 2ను జగన్ ప్రారంభిస్తారు. అనంతరం హెలికాఫ్టర్‌లో 12.05 గంటలకు అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలు, అధికారులతో మాట్లాడిన తర్వాత ఫార్మాసిటీలో యుగియా స్టెరైల్ ఫార్మా కంపెనీని ప్రారంభిస్తారు. అనంతరం 1.30కి అచ్యుతాపురంలోని ఏపీఎస్ఈజెడ్‌కు చేరుకుని లారస్ ల్యాబ్ యూనిట్ 2ను ప్రారంభిస్తారు..తర్వాత విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని.. అక్కడి నుంచి 3.20 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరిగి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు జగన్.
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

