Dussehra: కర్రల సమరానికి ముహూర్తం ఫిక్స్‌.. నిష్టలతో ఉత్సవాల్లో పాల్గోనున్న మూడు గ్రామాల భక్తులు.

Dussehra: కర్రల సమరానికి ముహూర్తం ఫిక్స్‌.. నిష్టలతో ఉత్సవాల్లో పాల్గోనున్న మూడు గ్రామాల భక్తులు.

Anil kumar poka

|

Updated on: Oct 16, 2023 | 12:01 PM

కర్రల సమరానికి దేవరగట్టు సిద్దమైంది. విజయదశమి రోజు అర్దరాత్రి జరిగే కర్రల సమరానికి ఆలయ వేదపండితులు ఇదివరకే ముహూర్తం ఖరారు చేశారు. కొన్ని ఏళ్లుగా దేవరగట్టు లో జరిగే బన్నీ ఉత్సవాన్ని కర్రల సమరం అని కూడా పిలుస్తారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లో కొండపై వెలసిన మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో కర్రల సమరానికి చాలా ప్రాధాన్యత ఉంది.

కర్రల సమరానికి దేవరగట్టు సిద్దమైంది. విజయదశమి రోజు అర్దరాత్రి జరిగే కర్రల సమరానికి ఆలయ వేదపండితులు ఇదివరకే ముహూర్తం ఖరారు చేశారు. కొన్ని ఏళ్లుగా దేవరగట్టు లో జరిగే బన్నీ ఉత్సవాన్ని కర్రల సమరం అని కూడా పిలుస్తారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లో కొండపై వెలసిన మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో కర్రల సమరానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఉత్సవాలకు ముందు వచ్చే అమావాస్య నుంచి నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు దీక్షలు చేపడతారు. అక్టోబరు 19న ఉత్సవ విగ్రహాలకు కంకణ ధారణ చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఇవి ముగిసేంతవరకు మూడు గ్రామాల భక్తులు నియమనిష్టలతో ఉంటారు. విజయదశమి రోజున అర్దరాత్రి మాల మల్లేశ్వర కళ్యణోత్సవం అనంతరం కర్రల సమరం నిర్వహిస్తారు. ఇందులో ఇతర గ్రామాలనుంచి వచ్చిన భక్తులు కూడా వందలాదిమంది పాల్గొంటారు. మద్యం సేవించి కర్రల సమరంలో పాల్గొని.. పల్లకి లో ఉన్న స్వామి వారి ఉత్సవ విగ్రహాలను తాకేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మూడు గ్రామాల భక్తులు వారిని అడ్డుకుంటారు. ఈ క్రమంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ప్రతి ఏటా వందల మంది తలలు పగులుతాయి. అయినా ఈ ఉత్సవాలు ఆపరు. దేవరగట్టు అటవీ ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 2000 అడుగుల ఎత్తయిన కొండ గుహలో శివపార్వతులు మాలమ్మ, మల్లేశ్వరుడుగా స్వయంభువుగా వెలిశారని స్థలపురాణం. అంతేకాదు, ఇక్కడి కొండ గుహల్లో త్రేతాయుగంలో లోక కళ్యాణం కోసం మునులు తపస్సు చేస్తుండగా రాక్షసులు ఆటంకం కలిగించేవారని, మునుల కోరికమేరకు వారితో యుద్ధం చేసి రాక్షసులను స్వయంగా పార్వతీ పరమేశ్వరులే అంతమొందించారట. వారు చనిపోతూ… దసరా పండుగరోజు దేవరగట్టులో తమకోసం నరబలి కావాలని పార్వతీ పరమేశ్వరులను కోరారట. అందుకు నిరాకరించిన పార్వతీ పరమేశ్వరులు కొన్ని చుక్కలు రక్తాన్ని ఇస్తామని చెబుతారు. అనంతరం ఆ రాక్షసులు అక్కడ రాళ్లుగా మారిపోతారు. అప్పటినుంచి ఆ ప్రదేశానికి రాక్షస గుండ్లుగా పేరు వచ్చిందని స్థలపురాణం. అందుకే దసరా పండగ రోజు దేవరగట్టు ప్రాంతంలో రక్తం చిందుతుందని భక్తులు నమ్ముతారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..