రోజూ ఈ ఆకు తింటే చాలు షుగర్ లెవెల్ మీ కంట్రోల్‌లో ఉంటుంది..!! ఇలా ట్రై చేసి చూడండి..

దీని కోసం చిన్న, ఆకుపచ్చ రంగులో ఉండే అందమైన ఆకులను ఎంచుకోండి. 3-4 ఆకులను మాత్రమే తీసుకుని వాటిని నీటితో బాగా కడగాలి. ఆ తరువాత వాటిని ఒక్కొక్కటిగా నమలండి. అలా తింటుండగా, జామ ఆకుల రసం బయటకు వస్తుంది. దాన్ని మీరు మింగేయొచ్చు కూడా. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇంకా అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

రోజూ ఈ ఆకు తింటే చాలు షుగర్ లెవెల్ మీ కంట్రోల్‌లో ఉంటుంది..!! ఇలా ట్రై చేసి చూడండి..
Guava Leaves
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 16, 2023 | 9:39 AM

ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం.. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ, లేదా తక్కువగా ఉండటం నేటి ప్రపంచంలో వేగంగా పెరుగుతోంది. దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. అనారోగ్యకర జీవనశైలి , ఆహారపు అలవాట్ల కారణంగా అన్ని వయసుల వారు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి ఈ వ్యాధికి ఒకసారి లొంగిపోతే, దానిని పూర్తిగా నయం చేయలేము. అయితే మనం అనుసరించే మందులు, క్రమబద్ధమైన జీవనశైలి, ఆహారంతో డయాబెటిస్‌ను ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. మధుమేహాన్ని నియంత్రించే సహజమైన మార్గాన్ని ఇక్కడ తెలుసుకుందాం.. ఈ పండ్ల చెట్టు ఆకులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అది జామ ఆకులు. దీన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

జామ ఆకు అనేక సమస్యలకు సహజ నివారిణిగా పనిచేస్తుంది. గరిష్ట ప్రయోజనాలను పొందడానికి ఇది సరైన మార్గంలో, సరైన సమయంలో వినియోగించాల్సి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు జామ ఆకులను నమలడం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రి వేళలో జామ ఆకులు తినటం వల్ల ఉదయం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు జామ ఆకులను ఎప్పుడైనా తీసుకోవచ్చని, అయితే రాత్రిపూట తీసుకోవడం ఉత్తమమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఎందుకంటే జామ ఆకులు రాత్రిపూట శరీరంలో బాగా కరిగిపోతాయి, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట మాత్రమే తినాలి.

ఇవి కూడా చదవండి

జామ ఆకులను నమిలే విధానం కూడా చాలా ముఖ్యం. దీని కోసం చిన్న, ఆకుపచ్చ రంగులో ఉండే అందమైన ఆకులను ఎంచుకోండి. 3-4 ఆకులను మాత్రమే తీసుకుని వాటిని నీటితో బాగా కడగాలి. ఆ తరువాత వాటిని ఒక్కొక్కటిగా నమలండి. అలా తింటుండగా, జామ ఆకుల రసం బయటకు వస్తుంది. దాన్ని మీరు మింగేయొచ్చు కూడా. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇంకా అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

జామకాయ, జామపండులో క్యాలరీలు చాలా తక్కువ కాబట్టి, దానిని తీసుకోవడం మంచిది. ఒక జామపండులో 37 నుంచి 55 కేలరీలు మాత్రమే ఉంటాయి. అంతేకాదు, జామపండు తిన్న తర్వాత మనిషికి ఎక్కువసేపు ఆకలి అనిపించదు. బరువు తగ్గించే ఆహారం కోసం ఇది మంచి ఎంపిక.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి