IRCTC: తక్కువ ధరలో హైదరాబాద్-షిర్డీ టూర్.. 2 రాత్రులు, 3 రోజులు ప్యాకేజీ..
హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని 'సాయి సన్నిధి హైదరాబాద్' అనే పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. అక్టోబర్ 25న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి రానుంది. ప్రతీ బుధవారం ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. 2 రాత్రులు, 3 రోజుల పాటు టూర్ ప్యాకేజీ ఉంటుంది. ఇక ఈ టూర్ ఎలా ప్రారంభమవుతుందంటే.. తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6.50 గంటలకు టూర్ ప్రారంభమవుతుంది...
IRCTC Hyderabad Shirdi Tour: వీకెండ్ వచ్చిందంటే చాలు టూర్‌కు ప్లాన్ చేస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా పలు సంస్థలు టూర్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఐఆర్‌సీటీసీ పలు ప్రాంతాలకు సేవలు అందిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి షిర్డీకి ఐఆర్‌సీటీసీ మంచి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్‌లను కవర్ చేస్తూ ఈ టూర్ ప్యాకేజీ ఉండనుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి ధరతో పాటు, పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం..
హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని ‘సాయి సన్నిధి హైదరాబాద్’ అనే పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. అక్టోబర్ 25న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి రానుంది. ప్రతీ బుధవారం ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. 2 రాత్రులు, 3 రోజుల పాటు టూర్ ప్యాకేజీ ఉంటుంది. ఇక ఈ టూర్ ఎలా ప్రారంభమవుతుందంటే.. తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6.50 గంటలకు టూర్ ప్రారంభమవుతుంది. అజంతా ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ నెంబర్ 17064 సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి షిర్డీకి మరో వాహనంలో చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ఫ్రెషప్ అవుతారు. అనంతరం షిర్డీలో ఆలయాన్ని సందర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అనంతరం శని శిగ్నాపూర్‌కు వెళ్తారు. అక్కడి నుంచి నాగర్ సోల్ రైల్వే స్టేషన్‌కు బయలుదేరుతారు. రాత్రి 8.30 గంటలకు మళ్లీ తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
రాత్రంతా ప్రయాణం ఉంటుంది. మూడో రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఇక ఈ టూర్ ప్యాకేజీ విషయానికొస్తే.. సింగిల్ షేరింగ్‌కు రూ. 13,100గా ఉండగా డబుల్ షేరింగ్‌కు రూ. 8020గా ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ విషయానికొస్తే రూ. 6390గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాస్ కోచ్‌లో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ విషయానికొస్తే సింగిల్ షేరింగ్‌కు రూ. 11,410కాగా, డబుల్ షేరింగ్‌కు రూ. 6330గా నిర్ణయించారు. హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..