AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Tickets: మీరు రిజర్వ్ చేసిన టికెట్‌తో మరొకరు వెళ్లొచ్చు.. రైల్వే అందిస్తున్న సదుపాయం గురించి తెలుసుకోండి..

ప్రభుత్వ ఉద్యోగులతో సహా ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందు అదే అభ్యర్థనను నమోదు చేయవలసి ఉంటుంది. ఐఆర్సీటీసీ పోర్టల్‌లో అభ్యర్థన చేసిన తర్వాత, టికెట్ కొత్త ప్రయాణికుడికి బదిలీ అవుతుంది. ఒకవేళ, ప్రయాణికుడు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి, పండుగ, వివాహ సందర్భం లేదా ఏదైనా వ్యక్తిగత సమస్య ఉన్నట్లయితే, వారు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు టికెట్ బదిలీ అభ్యర్థనను చేయవచ్చు.

Train Tickets: మీరు రిజర్వ్ చేసిన టికెట్‌తో మరొకరు వెళ్లొచ్చు.. రైల్వే అందిస్తున్న సదుపాయం గురించి తెలుసుకోండి..
IRCTC
Madhu
| Edited By: |

Updated on: Oct 15, 2023 | 7:05 PM

Share

మన షెడ్యూల్స్ మారుతుంటాయి. ఎప్పుడూ ఒకేలా ఉండవు. ముందు అనుకున్న విధంగా మీరు ఎప్పుడైనా రైలు టికెట్లు బుక్ చేసేసుకుంటే చివరి నిమిషంలో అవి కేన్సిల్ చేయాలంటే ఇబ్బంది. అయితే అటువంటి సందర్భాల్లో మీరు డబ్బలు సేవ్ చేసేందుకు భారతీయ రైల్వే శాఖ ఓ కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. ఇకపై మీరు రిజర్వేషన్ చేసుకున్న టికెట్లను వేరే ప్రయాణికులకు బదిలీ చేసుకోవచ్చు. దీని వల్ల ఎవరూ నష్టపోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ సదుపాయం ప్రయాణికుడి కుటుంబ సభ్యులకు మాత్రమే అవకాశం ఉంటుంది. రైల్వే టికెట్ బదిలీ సేవ పేరుతో దీనిని అమలు చేస్తున్నారు. అంటే మీ ప్రయాణం రద్దయితే మీ స్థానంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆ టికెట్ పై ప్రయాణం చేసే వీలుంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఈ సదుపాయాన్ని ఎలా పొందాలి?

ఈ సదుపాయాన్ని పొందడానికి, ప్రభుత్వ ఉద్యోగులతో సహా ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి 24 గంటల ముందు అదే అభ్యర్థనను నమోదు చేయవలసి ఉంటుంది. ఐఆర్సీటీసీ పోర్టల్‌లో అభ్యర్థన చేసిన తర్వాత, టికెట్ కొత్త ప్రయాణికుడికి బదిలీ అవుతుంది. ఒకవేళ, ప్రయాణికుడు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి, పండుగ, వివాహ సందర్భం లేదా ఏదైనా వ్యక్తిగత సమస్య ఉన్నట్లయితే, వారు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు టికెట్ బదిలీ అభ్యర్థనను చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ఎన్సీసీ అభ్యర్థులు కూడా టికెట్ బదిలీ సేవ ప్రయోజనాలను పొందవచ్చు. వ్యక్తిని భర్తీ చేసే రైలు ప్రయాణికులు ధ్రువీకరణ కోసం ప్రయాణ సమయంలో చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఐడీని కలిగి ఉండాలి.

ఇవి కూడా చదవండి

టికెట్‌ను ఎలా బదిలీ చేయాలి..

  • ముందుగా టికెట్ ప్రింటవుట్ తీసుకోవాలి.
  • అప్పుడు, మీరు సమీపంలోని రైల్వే స్టేషన్‌ను సందర్శించి రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి.
  • ఆ తర్వాత, మీరు టికెట్‌ను బదిలీ చేయాలనుకుంటున్న వ్యక్తి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటరు ఐడీ కార్డ్ వంటి ఐడీ రుజువును మీరు కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలి.
  • మీరు మీ ఐడీ రుజువు కాపీని సమర్పించాలి.
  • అప్పుడు, మీరు అన్ని డాక్యుమెంట్లతో కౌంటర్లో టికెట్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
  • దీని తర్వాత, మీ టికెట్ మీ స్థానంలో ప్రయాణించే వ్యక్తికి సులభంగా బదిలీ అవతుంది.
  • ఒక ప్రయాణికుడు ధ్రువీకరించబడిన టికెట్‌ను రద్దు చేసినప్పుడు, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఇంతకుముందు ఒక ప్రకటనలో పేర్కొంది. రద్దు చేసిన తర్వాత వెయిటింగ్ లిస్ట్‌లోని మొదటి వ్యక్తికి వెంటనే కేటాయిస్తారు. వేగవంతమైన నిర్ధారణను నిర్ధారించడానికి, ధ్రువీకరించబడిన ప్రయాణికుడికి భారతీయ రైల్వేలు పంపిన సందేశం ద్వారా తెలియజేయబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!