New Electric Scooter: రన్ రాజా ‘రన్ఆర్’.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 110కి.మీ.
ఇప్పటి వరకూ రన్ఆర్ మొబిలిటీ కంపెనీ కేవలం హెచ్ఎస్ ఈవీ స్కూటర్ ను మాత్రమే మన దేశ మార్కెట్లో విక్రయిస్తోంది. దీని ధర రూ. 1.25లక్షల నుంచి రూ. 1.30లక్షల(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది. ఈ హెచ్ఎస్ ఈవీ ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. వైట్, బ్లాక్, గ్రే, గ్రీన్ వంటి ఆప్షన్లలో లభిస్తోంది. ఈ స్కూటర్లో 60v 40AH లిథియం అయాన్ లిక్విడ్ కూల్డ్ వైర్ బౌండ్ బ్యాటరీలు ఉంటాయి.
మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఉన్న డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు అన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మార్కెట్లో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో రన్ఆర్ మొబిలిటీ కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లను లాంచ్ చేస్తోంది. ఇప్పటి వరకూ బీ2బీ మార్కెట్ కే పరిమితమైన రన్ఆర్ మొబిలిటీ ఇప్పుటు డీ2సీ(డైరెక్ట్ టు కస్టమర్) మార్కెట్లో ఎంటర్ అయ్యింది. ఈ నెలాఖరుకు 200 ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం కొత్త డీలర్ షిప్స్ ను కూడా తీసుకురానున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు టెస్ట్ రైడ్ చేయొచ్చని చెబుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దేశంలో 40 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను కూడా స్థాపించాలని తలపోస్తోంది. ఇప్పుడు రన్ఆర్ మొబలిటీ తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రన్ఆర్ హెచ్ఎస్ ఈవీ..
ఇప్పటి వరకూ రన్ఆర్ మొబిలిటీ కంపెనీ కేవలం హెచ్ఎస్ ఈవీ స్కూటర్ ను మాత్రమే మన దేశ మార్కెట్లో విక్రయిస్తోంది. దీని ధర రూ. 1.25లక్షల నుంచి రూ. 1.30లక్షల(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది. ఈ హెచ్ఎస్ ఈవీ ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. వైట్, బ్లాక్, గ్రే, గ్రీన్ వంటి ఆప్షన్లలో లభిస్తోంది. ఈ స్కూటర్లో 60v 40AH లిథియం అయాన్ లిక్విడ్ కూల్డ్ వైర్ బౌండ్ బ్యాటరీలు ఉంటాయి. ఇది సింగిల్ చార్జ్ పై 110 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. 1.5 కిలోవాట్ల బీఎల్డీసీ మోటార్ ఉంటుంది.
ఫీచర్ల విషయానికి వస్తే డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. దీనిలో రైడర్ కు అవసరం అయిన ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. యాంటీ థెఫ్ట్ వెహికల్ లోకేటర్స్, రిమోట్ ఫ్లీట్ మేనేజ్మెంట్, ఓవర్ ద ఎయిర్ లేదా ఓటీఏ అప్ డేట్లు ఉంటాయి. అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, హెడ్ ల్యాంప్ కూడా ఎల్ఈడీ ఉంటుంది.
రన్ఆర్ మొబిలిటీ ఫౌండర్ సేటుల్ షా మాట్లాడుతూ పాకెట్ ఫ్రెండ్లీ ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కొత్త స్టోర్లను కూడా ప్రారంభిస్తున్నామన్నారు. మార్కెట్లోని పోటీని తట్టుకునేందుకు అవసరమైన ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రన్ఆర్ హెచ్ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్ వినియోగానికి బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్న స్వాపింగ్ స్టేషన్లతో వినియోగదారులకు మంచి సర్వీస్ కూడా లభిస్తుందని పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..