Study Abroad: పిల్లలను విదేశాల్లో చదివిస్తున్న తల్లిదండ్రులపై మరింత భారం.. అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు.. వివరాలు..
కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు షాక్ ఇచ్చింది. కొత్త ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై మీ పిల్లల ఖర్చుల కోసం అని మీరు పంపే నగదుపై ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్(టీసీఎస్)ను వసూలు చేయనుంది. సరళీకృత చెల్లింపుల పథకం(లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్-ఎల్ఆర్ఎస్) కింద కొత్త విధానాన్ని ప్రారంభించింది. దీనిని అక్టోబర్ ఒకటో తేది నుంచి అమలు చేస్తోంది.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం అనేది చాలా మంది విద్యార్థులకు కల. ఆ కల సాకారం చేసుకునేందుకు ఎంత కష్టమైనా, ఎంత ఖర్చైనా వెనుకాడకుండా వెళ్తుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు షాక్ ఇచ్చింది. కొత్త ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై మీ పిల్లల ఖర్చుల కోసం అని మీరు పంపే నగదుపై ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్(టీసీఎస్)ను వసూలు చేయనుంది. సరళీకృత చెల్లింపుల పథకం(లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్-ఎల్ఆర్ఎస్) కింద కొత్త విధానాన్ని ప్రారంభించింది. దీనిని అక్టోబర్ ఒకటో తేది నుంచి అమలు చేస్తోంది.
విద్యపరమైన చెల్లింపులు, ట్యాక్స్ విధానం..
భారత కేంద్ర ప్రభుత్వం జూన్ 30న లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) కింద విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులు, నగదు లావాదేవీలపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పన్నుల్లో విద్య, వైద్యం విభాగాలకు మినహాయింపు ఉంటుంది. అయితే విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వారి రోజువారీ ఖర్చుల కోసం పంపే డబ్బుకు మాత్రం మినహాయింపు ఉండదు. వీటిపై టీసీఎస్ వసూలు చేస్తారు. అందువల్ల తల్లిదండ్రులకు ఇది పెనుభారం అవుతుంది.
ప్రస్తుతం ఇలా..
ప్రస్తుతం విధానం ప్రకారం విదేశాల్లో విద్య కోసం ఎల్ఆర్ఎస్ కింద విద్యారుణం తీసుకుంటే ట్యాక్స్ విధానం ఇలా ఉంది. విదేశాల్లో చదువు నిమిత్తం మీరు రూ. 7లక్షలకు పైగా లోన్ తీసుకుని పంపితే దానిపై 0.5శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే విద్యా రుణం కాకుండా వేరే ఇతర లోన్లు తీసుకొని, రూ. 7లక్షలకు పైగా నగదు పంపితే దానిపై 5శాతం ట్యాక్స్ పడుతుంది. అయితే విదేశాల్లో క్యాంపస్ లోని హాస్టల్స్ ఉండి చదువుకునే పిల్లలకు హాస్టల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులకు తప్పనిసరిగా సంబంధిత పత్రాలను రుజువులగా చూపాల్సిందే. లేకపోతే వాటిపై టీసీఎస్ 20శాతం పడుతుంది. అంతేకాక మీ పిల్లల చేతిలో డబ్బులుంటాయిలే అనుకొని పంపితే మాత్రం దానిపై 20శాతం టీసీఎస్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంపై శ్రద్ధ వహించాలి.
ఆ ఫారం తప్పనిసరి..
విదేశాల్లో పిల్లలకు మీరు పంపే డబ్బు ఏ అవసరం కోసం పంపుతున్నారో ముందుగా మీరు తెలియజేయాల్సి ఉంటుంది. అందుకోసం మీరు బ్యాంకులో ఏ2 అనే పారం ను తీసుకొని పూరించాల్సి ఉంటుంది. అందులో మీరు ఏ అవసరానికి నగదు పంపుతున్నారో చెబుతూ డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడ మీ పిల్లల విద్యాఅవసరాలకు కాకుండా ఇతర అవసరాల కోసం డబ్బులు పంపుతున్నారని తేలితే మాత్రం 20శాతం టీసీఎస్ వసూలు చేస్తారు. ఈ టీసీఎస్ ప్రభావాన్ని తగ్గించాలంటే అంతర్జాతీయ కార్డులను ఎంచుకోవడం ముఖ్యం. విద్య కోసం నిధులు పంపేటప్పుడు ఎల్ఆర్ఎస్ కోడ్ ను వినియోగించుకొని ఎటువంటి లోటుపాట్లు లేని లావాదేవీలు నిర్వహించాలి. అలాగే ఆదాయ పన్ను రిటర్న్ లను దాఖలు చేసేటప్పుడు టీసీఎస్ ను పొందుపరచాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..