ATM: ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వచ్చాయా? టెన్షన్ పడకుండా ఈ పని చేయండి..
Damage Currency: డబ్బు ఎవరికీ ఊరికే రావు. డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక సపాదించిన ఆ డబ్బును జనాలు ఇంట్లో అల్మారాలో గానీ.. బ్యాంకులో గానీ దాచుకుంటారు. అయితే, డబ్బు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం ఉంటుంది. వ్యక్తి బయటకు వెళ్తున్నారంటే జేబులో ఎంతో కొంత మొత్తంలో డబ్బు ఉండాల్సిందే. ఒకవేళ డబ్బు లేకపోతే..
Damage Currency: డబ్బు ఎవరికీ ఊరికే రావు. డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక సపాదించిన ఆ డబ్బును జనాలు ఇంట్లో అల్మారాలో గానీ.. బ్యాంకులో గానీ దాచుకుంటారు. అయితే, డబ్బు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం ఉంటుంది. వ్యక్తి బయటకు వెళ్తున్నారంటే జేబులో ఎంతో కొంత మొత్తంలో డబ్బు ఉండాల్సిందే. ఒకవేళ డబ్బు లేకపోతే.. తమ వెంట ఏటీఎం కార్డులను తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయ్యింది కానీ.. దాదాపు జనాలంతా జేబులో డబ్బులు లేకుండా బయటకు రావడం అనేది అసాధ్యం. ఇప్పుడైతే ఏ అవసరం ఉన్నా.. ఫోన్‌లో జస్ట్ ఒక్క క్లిక్‌తో ట్రాన్సాక్షన్ పూర్తయిపోతున్నాయి. అయినప్పటికీ పలు సందర్భాల్లో డబ్బు కోసం ప్రజలు ఏటీఎం సెంటర్లకు వెళ్తుంటారు. నగదు విత్‌డ్రా చేస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఏటీఎం మెషీన్ నుంచి చిరిగిన, ఫేక్ నోట్లు వస్తుంటాయి. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతుంటారు.
ఒకవేళ మీకు కూడా ఎప్పుడైన ఏటీఎం మెషీన్ల నుంచి పాత, చిరిగిన, నకిలీ నోట్లు వచ్చినట్లయితే.. ఏమాత్రం కంగారు పడకండి. ఎందుకంటే.. ఆ నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏటీఎం సెంటర్లలో వచ్చిన పాత, చిరిగిన, ఫేక్ నోట్లను నేరుగా సదరు బ్యాంక్ వద్దకు తీసుకెళ్లి చూపించారు. తద్వారా బ్యాంకు అధికారులు ఆ నోట్లను పరిశీలించి.. మార్చి ఇస్తారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ సైతం బ్యాంకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. మ్యుటిలేటెడ్, పాత నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ATM నుండి బయటకు వచ్చే అన్ని చిరిగిపోయిన, పాత, నకిలీ నోట్లకు బ్యాంకు బాధ్యత వహిస్తుంది. అందుకే ATM ద్వారా విత్‌డ్రా చేసిన చిరిగిన, ఫేక్ నోట్లను బ్యాంక్ కచ్చితంగా మార్చి ఇవ్వాల్సిందే. లేదంటే.. రూ. 10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక నోట్లను మార్చుకునేందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించరు.
నోట్ల మార్పిడికి పరిమితి ఉంటుందా?
రిజర్వ్ బ్యాంక్ సర్క్యూలర్ ప్రకారం.. ఒకవేళ ఏటీఎం నుంచి భారీ మొత్తంలో ఫేక్ నోట్లు, చిరిగిన నోట్లు వస్తే బ్యాంకు అధికారులకు సమాచారం అందించాలి. తద్వారా బ్యాంకు అధికారులు ఎంక్వైరీ చేస్తారు. ఇక ఒక వ్యక్తి ఒకేసారి 20 నోట్లు.. అది కూడా రూ. 5 వేలు మించకుండా మార్చుకునే అవకాశం ఉంది. అంతకు మించి ఉంటే.. బ్యాంకు అధికారుల దర్యాప్తు తప్పనిసరిగా ఉంటుంది. ఇక కాలిపోయిన, చిన్న చిన్న ముక్కలు అయిన నోట్లను బ్యాంకు మార్చవు.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..