Money Astrology: శని, శుక్ర గ్రహాల పరస్పర వీక్షణ.. వారికి ఆర్థిక, ఉద్యోగ స్థిరత్వం పక్కా.. !
శనీశ్వరుడు, శుక్రుడు ఆర్థిక, ఉద్యోగ స్థిరత్వానికి కారకత్వం వహిస్తారు. ప్రస్తుతం సింహ రాశిలో ఉన్నశుక్రుడు, కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడు పరస్పరం వీక్షించుకోవడంతో పాటు, సింహ, కుంభ రాశులు రెండూ స్థిర రాశులే కావడం వల్ల ఆరు రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది.
జీవితంలో ఆర్థికంగా గానీ, ఉద్యోగపరంగా గానీ స్థిరత్వం లభించాలన్న పక్షంలో శనీశ్వరుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. శనీశ్వరుడికి ప్రాణస్నేహితుడైన శుక్రుడు కూడా స్థిరత్వానికి కారకత్వం వహిస్తాడు. ప్రస్తుతం సింహ రాశిలో ఉన్నశుక్రుడు, కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడు పరస్పరం వీక్షించుకోవడంతో పాటు, సింహ, కుంభ రాశులు రెండూ స్థిర రాశులే కావడం వల్ల ఆరు రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ఆ ఆరు రాశులుః మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, కుంభం.
- మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడు, లాభ స్థానంలో శనీశ్వరుడు ఉండి పరస్పరం వీక్షించు కుంటున్నందు వల్ల ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. గ్రహ సంచారం ప్రకారం ఈ రాశివారు ప్రస్తుతం ఉద్యోగం మారే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్ రావడం గానీ, ఆదాయం పెరగడం గానీ జరగవచ్చు. ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, స్థిరపడడం కూడా జరుగుతుంది.
- వృషభం: ఈ రాశివారికి చతుర్థంలో శుక్రుడు, దశమంలో శనీశ్వరుడు ఉండి, ఒకరినొకరు చూసుకుంటు న్నందువల్ల ఉద్యోగపరంగా తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయ త్నాలు సఫలం కాకపోవచ్చు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభి స్తుంది. ఉద్యోగం కారణంగా గృహ, వాహన సౌకర్యాలు అమర్చుకోవడం జరుగుతుంది. ఆర్థిక స్థిర త్వానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కానీ, ఆస్తులు పెంపొందించుకోవడం మాత్రం జరుగు తుంది.
- సింహం: ఈ రాశిలో ఉన్న శుక్రుడి మీద సప్తమ స్థానం నుంచి శనీశ్వరుడి దృష్టి పడడం వల్ల తప్పకుండా వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు లాభసాటిగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో చాలా కాలం పాటు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఉద్యోగంతో పాటే ఆర్థికంగా కూడా స్థిరత్వం కూడా లభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు సఫలం అవుతాయి.
- తుల: ఈ రాశినాథుడైన శుక్రుడు లాభస్థానంలో ఉండడం, ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు పంచమ స్థానం నుంచి శుక్రుడితో పరస్పర వీక్షణ కలిగి ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగానూ, ఆర్థికంగానూ ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. ప్రస్తుత ఉద్యోగంలోనే వేగంగా పురోగతి చెందే అవకాశం ఉంటుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పురోగతితో పాటే ఆదాయం కూడా పెరగడం వల్ల ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడం జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో, అంటే వృత్తి, ఉద్యోగాల స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో శనీ శ్వరుడు ఉండి ఒకరినొకరు వీక్షించుకోవడం వల్ల వృత్తి, ఉద్యోగాలలో తప్పకుండా స్థిరత్వం లభి స్తుంది. ఉద్యోగం మారాలన్న ఆలోచన కూడా కలగకపోవచ్చు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ప్రత్యేక బాధ్యతలను, ప్రత్యేక అధికారాలను అప్పగించడం జరుగుతుంది. దశమ స్థానంలో ఉన్న శుక్రుడు ఆదాయం పెంచి, ఆర్థిక స్థిరత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది.
- కుంభం: ఈ రాశినాథుడైన శనీశ్వరుడు ఈ రాశిలోనే ఉండడం, సప్తమ కేంద్రంలో శుక్రుడు సంచరించడం వల్ల ఉద్యోగపరంగానే కాకుండా, ఆర్థికంగా కూడా ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. ప్రస్తుత ఉద్యోగంలోనే ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రాశివారి మీద అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ప్రస్తుత ఉద్యోగంలోనే ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం, శుభ కార్యాలు చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.