Zodiac Signs: తులా రాశిలోకి కుజ గ్రహం.. లైంగిక వాంఛల పట్ల వారు జాగ్రత్త!
శుక్రుడి రాశులైన వృషభ, తులల్లో కుజుడు ప్రవేశించినా, కుజుడి రాశులైన మేష, వృశ్చికాల్లో శుక్రుడు ప్రవేశించినా లేక ఈ రెండు గ్రహాలు ఎక్కడైనా కలుసుకున్నా, పరస్పరం చూసుకున్నా శృంగార వాంఛలు అధికమవుతాయని, కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ కుజుడు వక్ర గ్రహమైన కేతువుతో ఇక్కడ కలుస్తున్నందువల్ల, మనో నిగ్రహానికి కూడా అవకాశం ఉండక పోవచ్చు.
Zodiac Signs in Telugu: ఈ నెల 4వ తేదీ నుంచి తులా రాశిలో ప్రవేశిస్తున్న కుజ గ్రహం ఇక్కడ నవంబర్ 16 వరకూ కొనసాగుతుంది. ఇది శృంగార దేవత అయిన శుక్రుడి స్థానం. శుక్రుడి రాశులైన వృషభ, తులల్లో కుజుడు ప్రవేశించినా, కుజుడి రాశులైన మేష, వృశ్చికాల్లో శుక్రుడు ప్రవేశించినా లేక ఈ రెండు గ్రహాలు ఎక్కడైనా కలుసుకున్నా, పరస్పరం చూసుకున్నా శృంగార వాంఛలు అధికమవుతాయని, కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ కుజుడు వక్ర గ్రహమైన కేతువుతో ఇక్కడ కలుస్తున్నందువల్ల, మనో నిగ్రహానికి కూడా అవకాశం ఉండక పోవచ్చు. కుజ గ్రహం పురుష గ్రహం అయినందువల్ల ఎక్కువగా పురుషుల మీదే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సుమారు 45 రోజులు తులా రాశిలో ఉండబోతున్న ఈ కుజ గ్రహం వల్ల ఏయే రాశుల వారు ఏ విధంగా అవస్థలు లేదా తిప్పలు పడబోతున్నారో ఇక్కడ పరిశీలిద్దాం. గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తప్పకుండా వ్యక్తిగత జాతకం మీద కూడా ఇది ఆధారపడి ఉంటుందని గమనించాలి.
- మేషం: ఈ రాశికి సరిగ్గా సప్తమంలో కుజుడు ప్రవేశించడం, ఈ రాశిని వీక్షించడం వల్ల లైంగిక వాంఛలు తప్పకుండా పేట్రేగిపోయే అవకాశం ఉంది. పైగా కుజుడితో సమానమైన కేతువు కూడా తులా రాశిలోనే ఉండడం వల్ల శృంగారం విషయంలో వక్ర బుద్ధులు పుట్టడం కూడా జరుగుతుంది. ప్రయాణాలలో అనవసర పరిచయాలు ఏర్పడే సూచనలున్నాయి. ఇటువంటి కారణాల వల్ల దాంపత్య జీవితంలో కొద్దిగా అపశ్రుతులు దొర్లే ప్రమాదం కూడా ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
- వృషభం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో కుజ గ్రహ ప్రవేశం వల్ల అడ్డూ ఆపూ లేని శృంగార కార్యకలాపాలకు అవకాశం ఉంటుంది. రహస్య కార్యకలాపాలు తప్పకపోవచ్చు. సాధారణంగా సాటి ఉద్యోగులతో సాన్నిహిత్యం పెంపొందించుకునే అవకాశం ఉంది. అనవసర పరిచయాలు, అక్రమ సంబంధాలతో పాటు, వ్యసనాలకు పాల్పడే సూచనలు కూడా ఉన్నాయి. లైంగిక సంబంధమైన విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. అనవసర పరిచయాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది.
- మిథునం: ఈ రాశివారికి పంచమ స్థానంలో కుజ గ్రహ ప్రవేశం, అక్కడ కేతువుతో యుతి చెందడం వల్ల శృంగార సంబంధమైన ఆలోచనలు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడు తుంది. శృంగారం పట్ల అనాసక్తిగా ఉన్నవారిలో కూడా విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. వక్ర ధోరణులు, వికృత కార్యకలాపాలు కూడా తప్పకుండా విజృంభిస్తాయి. సాధారణంగా సహచరులు, స్నేహితులతో శృంగార కార్యకలాపాలు నడిపే సూచనలున్నాయి. నిగ్రహంతో వ్యవహరించడం మంచిది.
- కర్కాటకం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో, అంటే సుఖ స్థానంలో కుజ గ్రహ ప్రవేశం సాధారణంగా ఉండక పోవచ్చు. శృంగార కార్యకలాపాలకు అత్యధిక సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. సాధా రణంగా జీవిత భాగస్వామికే అంకితమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దగ్గర బంధువులతో సాన్నిహిత్యం పెంచుకునే అవకాశం లేకపోలేదు. వీటితో కొద్దిగా వ్యసనాలమీద దృష్టి పెట్టే సూచనలు కూడా ఉన్నాయి. జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశానికి అవకాశం ఇవ్వకపోవడం మంచిది.
- సింహం: తృతీయ స్థానంలో కేతువు సంచారం కారణంగా ఇప్పటికే మోతాదును మించిన శృంగార కార్య కలాపాల్లో మునిగి తేలుతున్న ఈ రాశివారికి కేతువుతో కలుస్తున్న కుజుడి వల్ల మరింతగా పేట్రే గిపోయే అవకాశం ఉంటుంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు కూడా అవకాశం ఉంటుంది. సాధారణంగా దగ్గరి బంధువులతో సాన్నిహిత్యం పెరిగే సూచనలున్నాయి. వీటి కోసం ఎక్కువగా ప్రయాణాలు, పర్యటనలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద కాస్తంత దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
- కన్య: ఈ రాశివారికి ద్వితీయ స్థానంలో కుజ ప్రవేశం వల్ల శృంగార సంబంధమైన కార్యకలాపాలు శ్రుతి మించే అవకాశం ఉన్నప్పటికీ ఇవి ఎక్కువగా ఇంటికే పరిమితం కావడం జరుగుతుంది. శృంగార కార్యకలాపాల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. విహార యాత్రలు చేయడం, ద్వితీయ స్థానంలోనే ఉన్న కేతువు కారణంగా కొత్త కొత్త ప్రయోగాలు చేయడం, వేషభాషలు మార్చడం వంటివి చోటు చేసుకుంటాయి. సతీమణి మీద బాగా ఖర్చుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
- తుల: ఈ రాశిలోనే కుజుడు ప్రవేశించడం, పైగా అక్కడ కేతువుతో కలవడం వల్ల తప్పకుండా శృంగార జీవితంలో మునిగి తేలడం జరుగుతుంది. అనవసర పరిచయాలు, అక్రమ సంబంధాలతో పాటు శృంగార సంబంధమైన ఆలోచనలు కూడా విజృంభించడం జరుగుతుంది. విలాస జీవితం కూడా అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతుంది. వ్యసనాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సప్తమ స్థానం నుంచి గురువు దృష్టి పెట్టినందువల్ల దాంపత్య జీవితం కూడా కొత్త పుంతులు తొక్కే అవకాశం ఉంది.
- ౌవృశ్చికం: వ్యయ స్థానంలోకి, అంటే శయన స్థానంలోకి ప్రవేశిస్తున్న కుజుడు ఈ రాశినాథుడు కూడా అయి నందువల్ల మోతాదు మించిన శృంగారం ఈ రాశివారిని చుట్టుముట్టే అవకాశం ఉంది. అనవసర పరిచయాలు, అక్రమ సంబంధాలు తప్పకపోవచ్చు. వీటికి తోడు వ్యసనాలకు అలవాటు పడే సూచనలు కూడా ఉన్నాయి. దాంపత్య జీవితం కూడా తప్పకుండా కొత్త పుంతలు తొక్కుతుంది. కొద్ది రోజుల పాటు శృంగారమే ధ్యేయంగా జీవితం కొనసాగవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
- ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో కుజుడు తులా రాశిలో ప్రవేశించడం వల్ల కొద్దిగా శృంగార కార్యకలా పాలు, శృంగార సంబంధమైన ఆలోచనలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, రాశ్యధిపతి అయిన గురువు పంచమ స్థానం నుంచి ఈ కుజుడిని వీక్షిస్తున్నందువల్ల ఇవన్నీ కొద్దిగా అదుపులో ఉండే అవ కాశం ఉంది. దాంపత్య జీవితంలో మాత్రం సుఖ సంతోషాలు కొత్త పుంతలు తొక్కడం, అడ్డూ ఆపూ లేకుండా సాగిపోవడం జరుగుతుంది. ఇష్టమైన ప్రాంతాలకు విహారాలు చేయడం జరుగు తుంది.
- మకరం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం ప్రారంభమైనందువల్ల వృత్తి, ఉద్యోగ స్థానాలలో కొందరితో సాన్నిహిత్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే, క్రమశిక్షణకు మారుపేరైన శనీశ్వరుడు ఈ రాశికి అధిపతి కావడం, కుటుంబ స్థానంలో బలంగా సంచారం చేస్తుండడం వల్ల ఎక్కువగా అనవసర పరిచయాలకు సిద్ధపడే అవకాశం ఉండకపోవచ్చు. శృంగార సంబంధమైన ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితం మరింత సుఖమయంగా మారే అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశికి కూడా శనీశ్వరుడే అధిపతి అయినందువల్ల నవమ స్థానంలో ప్రవేశిస్తున్నకుజ గ్రహం వల్ల పెద్దగా ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. అతి తక్కువ స్థాయిలో అనవసర పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా వీరి శృంగార కార్యకలాపాలన్నీ ఎక్కువగా ఆలోచనలకు, దాంపత్య జీవితానికే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. భాగ్య స్థానంలో ప్రవేశించిన కుజుడి వల్ల, అక్కడే ఉన్న కేతువు వల్ల ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిమగ్నమయే అవకాశం ఉంటుంది.
- మీనం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో ప్రవేశించిన కుజుడి వల్ల శృంగార సంబంధమైన రహస్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ఈ రాశినాథుడైన గురువు కుటుంబ స్థానంలో బలంగా ఉన్నందువల్ల దాంపత్య జీవితానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ స్థాయిలోనే అయినప్పటికీ, ఉద్యోగ స్థానంలో గానీ, బాగా దగ్గర బంధువులతో గానీ సాన్నిహిత్యం పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు, పర్యటనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి