Horoscope Today: వారు శుభవార్తలు వింటారు.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు..

దినఫలాలు (అక్టోబర్ 4, 2023): మేష రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారాల్లో క్షణం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. మిథున రాశికి చెందిన వారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారు శుభవార్తలు వింటారు.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు..
Horoscope Today 04th October 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 04, 2023 | 5:01 AM

దినఫలాలు (అక్టోబర్ 4, 2023): మేష రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారాల్లో క్షణం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. మిథున రాశికి చెందిన వారి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):

ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి, బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి మీదా కోపతాపాలు ప్రదర్శించకపోవడం మంచిది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

వృత్తి, ఉద్యోగాల వాతావరణం, కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో క్షణం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మది మీద పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలు పరి ష్కారం అవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

ఏ రంగం వారికైనా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవ కాశం ఉంది. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగు లకు మంచి అవకాశాలు అందివస్తాయి. పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

పట్టుదలగా కొన్ని వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆపీసు నుంచి బకా యిలు కూడా వసూలవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజన కంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులకు అండగా నిలబడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం కావచ్చు. విద్యార్థులకు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. స్వల్ప అనా రోగ్య సమస్యలుంటే ఉండవచ్చు. పట్టుదలగా కొన్నిముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో బాగా పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. కొందరు స్నేహితులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగు తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వీలైతే ప్రయాణాలు కూడా వాయిదా వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. విద్యా ర్థులకు కొద్ది శ్రమ మీద మంచి ఫలితాలు అందుతాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

సమయం అన్నివిధాలుగానూ అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. వృత్తి, వ్యాపారాలు పూర్తి స్థాయిలో బిజీ అయిపోయి, రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యో గంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదమొకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):

ఏ పని తలపెట్టినా కొద్దిపాటి ఆటంకాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందకపోవచ్చు. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చాలావరకు దారిలోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. విద్యా ర్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకోవచ్చు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. రోజంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో ప్రయా ణిస్తాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులు చదువుల్లో, క్రీడల్లో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):

ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకో కుండా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తులకు సంబంధించి తండ్రి నుంచి శుభవార్తలు వింటారు. రాజకీయ నేతలతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరిగి ఒత్తిడి ఉంటుంది. వ్యాపా రాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

కొన్ని వ్యక్తిగత వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలు కూడా చాలా వరకు చక్కబడతాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబసమే తంగా ఆలయాలు సందర్శిస్తారు. కోర్టు వివాదం లేదా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు పెరు గుతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపో తాయి.