River Ganga: గంగానది తీరంలో ఆధ్యాత్మిక ప్రదేశాలు.. విదేశీయులు కూడా శాంతి కోసం ఇక్కడి వస్తారు..

కాలంతో పోటీ పడుతూ ఉరుకులు పరుగులు పెడుతున్న మానవ జీవితం.. నిరంతరం పని చేయడం వల్ల మనం ఒక యంత్రంలా మారి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డాడం.. కాలంతో పాటు నడుస్తునే యంత్రం లాంటి జీవితం నుంచి బయటపడేందుకు జనాలు వివిధ ప్రాంతాలకు పర్యటనకు వెళ్తుంటారు. మరికొందరు జలపాతాలను, నీటి పరివాహక ప్రాంతాలను ఎక్కువగా ఇష్టపడతారు. చాలా మందికి గంగా నది ఒడ్డున కూర్చుని కొంత సేపైనా ప్రశాంతంగా గడపాలని కలలు కంటారు.

Surya Kala

|

Updated on: Oct 16, 2023 | 9:29 AM

హిందువులు నదులను పవిత్రంగా భావిస్తారు.  పూజిస్తారు. గంగానది ప్రవహించే ప్రదేశం పవిత్రంగా మారుతుందని.. ఆ ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా దర్శనీయ స్థలాలుగా మారుతాయని చెబుతారు. గంగా నది ప్రవహించే ప్రదేశం చాలా అభివృద్ధి చెందింది. అలాంటి ప్రదేశాలకు వెళ్లేందుకు అందరూ ఇష్టపడతారు. కాబట్టి ఈ రోజు మనం గంగా నది ఒడ్డిన ప్రవహించే ప్రసిద్ధి ప్రదేశాల గురించి మీకు చెప్తాము. ఇలాంటి ప్రదేశాల్లో ప్రశాంతంగా గడపవచ్చు.

1 / 5
దేవప్రయాగ: ఉత్తరాఖండ్‌లో ఉన్న దేవప్రయాగ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దేవప్రయాగకు ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇది సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉంది. రిషికేశ్ వెళుతున్నట్లయితే, దేవప్రయాగను తప్పకుండా సందర్శించండి. రిషి కేష్ నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో దేవ ప్రయాగ ఉంది. ఉత్తరాఖండ్ లోని ఐదు ప్రయాగులలో దేవప్రయాగ ఒకటి. ఇక్కడ అత్యంత సుందరమైన దృశ్యం భాగీరథి, అలకనంద సంగమం.

2 / 5
రిషికేశ్: గంగానది పర్వతాల నుండి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రవహించే మైదాన ప్రాంతం రిషికేశ్. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. హిమాలయాల దిగువ కొండల నడుమ చుట్టూ ఉండే ఈ నగరంలో గంగానది ప్రవహిస్తూ మరింత స్వచ్ఛంగా చేస్తుంది. రిషికేశ్ ఆధ్యాత్మికతకు కేంద్రంగా కూడా పరిగణించబడుతుంది.

3 / 5
ప్రయాగ్రాజ్: ప్రయాగ్‌రాజ్ అంటే అలహాబాద్ హిందువులకు తీర్థయాత్రల పరంగా చాలా ముఖ్యమైనది. 2019లో జరిగిన కుంభమేళ తర్వాత ఈ నగరంలో చాలా మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఈ నగరం తన పాత గుర్తింపును నిలుపుకుంటూనే ఉంది. ఇక్కడ గంగా, యమునా, సరస్వతి అనే మూడు నదుల సంగమంతో పవిత్ర ప్రదేశంగా హిందువులతో పూజలను అందుకుంటుంది. 

4 / 5
వారణాసి: అతిపురాతన క్షేత్రం కాశి.. శివుని జ్యోతిర్లింగ క్షేత్రం కాశీ విశ్వనాథుడు వారణాసిలో కొలువై పూజలను అందుకుంటున్నాడు. వారణాసి అంటే బనారస్ అనే పేరు చాలా మందికి తెలుసు. ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి.  ఒక్కసారి కాశీకి వెళితే అక్కడ ఉండిపోవాలని చాలామంది ఆధ్యాత్మికతను ఇష్టపడేవారు కోరుకుంటారు. 

5 / 5
Follow us