J Y Nagi Reddy | Edited By: Surya Kala
Updated on: Oct 16, 2023 | 8:38 AM
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొదటిరోజు భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శైలపుత్రీ అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించారు.
బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు.
శ్రీ భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు భృంగివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలను చేశారు. అమ్మవారు స్వామి వార్లకు కర్పూరహారతులిచ్చరు.
ఉత్సవమూర్తులు వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు చెక్క భజనలు వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించారు.
గ్రామోత్సవంగా కదలివస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు,పలువురు ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.