- Telugu News Photo Gallery Cricket photos Icc World Cup 2023 Updated Points Table After England vs Afghanistan 13th Match at Arun Jaitley Stadium, Delhi
ENG vs AFG: ఆంగ్లేయులపై అద్భుత విజయం.. ఆఫ్ఘాన్ దెబ్బకు పాయింట్ల పట్టికలో కీలక మార్పులు..
ICC World Cup 2023 Points Table: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో గత రాత్రి జరిగిన ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 69 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ల ముందు ఇంగ్లండ్ ఆటగాడు మోకరిల్లారు. పరుగులు చేయలేక తంటాలు పడ్డారు. దీంతో ఆలౌట్ అయ్యి ఘోర పరాజయం పాలైంది.
Updated on: Oct 16, 2023 | 8:38 AM

ICC World Cup 2023 Points Table: ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ల ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లు మోకరిల్లారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలోనూ మార్పులు వచ్చాయి.

భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మోడీ స్టేడియంలో పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా, ప్రస్తుతం మూడు మ్యాచ్‌లలో ఆరు పాయింట్లు సాధించి, నికర రన్ రేట్ +1.821తో అగ్రస్థానంలో నిలిచింది.

చివరిసారి రన్నరప్ న్యూజిలాండ్ కూడా మూడు గేమ్‌లలో ఆరు పాయింట్లు, నికర రన్ రేట్ +1.604తో రెండవ స్థానంలో ఉంది.

ఈ ప్రపంచకప్‌లో పటిష్టంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు, +2.360 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో ఉంది.

గత మ్యాచ్‌లో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్.. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది.

నిన్నటి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓటములు, ఒక విజయంతో 5వ స్థానంలో ఉంది.

గతంలో చివరి స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇంగ్లండ్‌పై విజయంతో ఆరో స్థానానికి ఎగబాకింది. ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోయి, నేటి మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ వరుసగా 6, 7, 8, 9, 10వ ర్యాంక్‌లలో ఉన్నాయి.




