- Telugu News Photo Gallery Cricket photos Sri Lanka Cricket Team Skipper Dasun Shanaka Ruled Out Of The ICC ODI World Cup 2023
World Cup 2023: శ్రీలంక జట్టుకు భారీ షాక్.. ప్రపంచకప్ నుంచి కెప్టెన్ ఔట్..
ICC World Cup 2023: వరుస పరాజయాలతో సతమతమవుతున్న శ్రీలంక జట్టుకు గట్టి షాక్ తగిలింది. అక్టోబర్ 10న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన శ్రీలంక కెప్టెన్ ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి పూర్తిగా దూరమయ్యాడు. దీంతో లంక జట్టుకు భారీ నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే వరుస పరాజయాలు, మరోపక్క ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతుంది. మరిన్ని పరాజయాలు ఎదురైతే.. ఇంటిబాట పట్టాల్సిందే.
Updated on: Oct 15, 2023 | 8:04 PM

వరుస పరాజయాలతో కంగుతిన్న శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది. అక్టోబర్ 10న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ నుంచి దూరమయ్యాడు.

గాయపడిన దసున్ షనక స్థానంలో బౌలింగ్ ఆల్ రౌండర్ చమిక కరుణరత్న మళ్లీ జట్టులోకి ఎంపికయ్యాడు.

వసీం ఖాన్, క్రిస్ టెట్లీ, హేమంగ్ అమిన్, గౌరవ్ సక్సేనాలతో కూడిన ఈవెంట్ టెక్నికల్ కమిటీ షనక స్థానంలో చమికను ఎంపిక చేయాలనే నిర్ణయాన్ని ఆమోదించింది.

ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. 1996 వన్డే ప్రపంచకప్ ఛాంపియన్లకు పెద్ద దెబ్బ తగిలింది అంటూ చెప్పుకొచ్చింది.

శ్రీలంక క్రికెట్ ప్రకారం, షనక గాయం నుంచి కోలుకోవడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుంది. ప్రస్తుతం షనకకు బదులుగా ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన చమికకు అంతర్జాతీయంగా ఎంతో అనుభవం ఉందని, రాబోయే మ్యాచ్‌ల్లో అవకాశం ఇస్తే జట్టుకు తనవంతు సహకారం అందిస్తాడని చెబుతున్నారు.

28 మే 2021న మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన చమిక, మార్చి 31న హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో న్యూజిలాండ్‌తో లంక తరపున తన చివరి ODI ఆడాడు.

చమికా ఇప్పటి వరకు 23 వన్డేల్లో 28.83 స్ట్రైక్ రేట్‌తో 24 వికెట్లు తీశాడు. అతను బ్యాటింగ్‌లో 27.68 సగటు, 80.98 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు చేశాడు.

అక్టోబర్ 16న లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శ్రీలంక తన తదుపరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.




