- Telugu News Photo Gallery If you eat this fruit 2 times in a week the white hair will turn black from the root forever Telugu News
ఈ పండును వారానికి 2 సార్లు తింటే చాలు.. మీ జుట్టు ఎప్పటికీ నల్లగా ఉంటుంది..
తెల్ల జుట్టు సమస్య ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ఒక సాధారణ సమస్య. ప్రస్తుతం చిన్న పెద్దా తేడా లేకుండా చాలా మంది నెరిసిన జుట్టు సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అయితే, తెల్లజుట్టును నల్లగా మార్చుకోవడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, అలాంటి వారు ఆహారం విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే..
Updated on: Oct 16, 2023 | 10:47 AM

Hair Care Tips- ఒక్కోసారి శరీరానికి కావాల్సిన పోషకాలను అందించే ఆహారపదార్థాలపై ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయటం కూడా జుట్టు సమ్యసలకు కారణం అవుతుంది. ఐరన్ లోపం వల్ల జుట్టు అకాల నెరసిపోతుంది. కాబట్టి ఏ ఆహారాలు జుట్టును మళ్లీ నల్లగా మార్చగలవో తెలుసుకోవాలంటే.

Oranges- ఆరెంజ్ ఫ్రూట్: నారింజ పండ్లను తీసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండులో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది, దీని సహాయంతో తెల్ల జుట్టును నల్లగా మార్చవచ్చు. కాబట్టి వారానికి రెండుసార్లు ఆ పండు తినడానికి ప్రయత్నించండి. మీరు కొన్ని రోజుల్లో ప్రభావాన్ని చూడవచ్చు.

Lemon- నిమ్మ కాయ: నిమ్మకాయను తీసుకోవడం వల్ల కూడా మీ ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది. ఇది మంచి మొత్తంలో అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. దాని సహాయంతో, నెరిసిన జుట్టు నల్లగా మారుతుంది.

Sweet Potato- చిలగడదుంప: నేల కింద పెరిగే ఈ దుంప జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అయిన బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును నల్లగా చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. జుట్టు షైన్ మెయింటెయిన్ చేయడంలో చాలా సహాయపడుతుంది.

Papaya- బొప్పాయి పండులో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు సహాయపడతాయి.





























