- Telugu News Photo Gallery Cinema photos After the mass blockbuster Nani with a medium range romantic entertainer
Nani: మాస్ బ్లాక్ బస్టర్ తరువాత మీడియం రేంజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. నాని కెరీర్‌కు ప్లస్ అవుతుందా.?
సాధారణంగా ఓ మాస్ హిట్ పడితే.. హీరోలు ఇక అదే జానర్‌ను కంటిన్యూ చేస్తారు. కమర్షియల్ స్టార్‌గా కెరీర్ కంటిన్యూ చేయాలంటే మాస్ ఇమేజ్‌ను అలాగే మెయిన్ టైన్ చేయాలి. కానీ నాని మాత్రం ఆ ఫార్ములాను ఫాలో అవ్వటం లేదు. మాస్ బ్లాక్ బస్టర్ తరువాత మీడియం రేంజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. దసరా సినిమాతో తన ఇమేజ్ తానే బ్రేక్ చేశారు నాని. ఎక్కువగా రొమాంటిక్, లవర్ భాయ్ రోల్స్ మాత్రమే చేసిన నేచురల్ స్టార్, ఒక్కసారి ఊర మాస్ లుక్‌లో షాక్ ఇచ్చారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Oct 16, 2023 | 10:26 AM

సాధారణంగా ఓ మాస్ హిట్ పడితే.. హీరోలు ఇక అదే జానర్‌ను కంటిన్యూ చేస్తారు. కమర్షియల్ స్టార్‌గా కెరీర్ కంటిన్యూ చేయాలంటే మాస్ ఇమేజ్‌ను అలాగే మెయిన్ టైన్ చేయాలి. కానీ నాని మాత్రం ఆ ఫార్ములాను ఫాలో అవ్వటం లేదు. మాస్ బ్లాక్ బస్టర్ తరువాత మీడియం రేంజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.

దసరా సినిమాతో తన ఇమేజ్ తానే బ్రేక్ చేశారు నాని. ఎక్కువగా రొమాంటిక్, లవర్ భాయ్ రోల్స్ మాత్రమే చేసిన నేచురల్ స్టార్, ఒక్కసారి ఊర మాస్ లుక్‌లో షాక్ ఇచ్చారు. అయితే ఈ చేంజోవర్ ఆడియన్స్‌కు బాగానే కనెక్ట్ అయ్యింది. అందుకే నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది దసరా.

దసరాతో పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేసిన నాని ఆ క్రేజ్‌ను అలాగే కంటిన్యూ చేయాలనుకోవటం లేదు. అందుకే అంతటి బిగ్ హిట్ తరువాత ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. హాయ్ నాన్న మూవీతో మరోసారి తనకు బాగా పట్టున్న జానర్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్నారు.

కొత్త దర్శకుడు శౌర్యువ్ రూపొందిస్తున్న హాయ్ నాన్న సినిమాలో మరోసారి తనలోని నేచురల్ యాక్టర్‌ని ప్రజెంట్ చేస్తున్నారు నాని. ఓ పాపకు తండ్రిగా కనిపిస్తూనే మృణాల్ ఠాకూర్‌తో రొమాంటిక్ సీన్స్‌లోనూ నటించారు. నాని మార్క్ ఎంటర్‌టైనరే అయినా... ఈ సినిమా వసూళ్ల పరంగా దసరా రేంజ్‌ను బీట్ చేయటం అంత ఈజీ కాదన్నది ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న మాట.

నాని మాత్రం ఈ నిర్ణయం కాన్షియస్‌గానే తీసుకున్నారట. దసరాతో తన మీద ఏర్పడ్డ అంచనాలు కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇమిడియట్‌గా ఓ మీడియం రేంజ్ రొమాంటిక్ డ్రామాను సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈ ప్లాన్ నాని కెరీర్‌కు ప్లస్ అవుతుందా.? మైనస్ అవుతుందా? అన్నది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.





























