AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇంద్రకీలాద్రిపై నకిలీ పాస్‌ల దందా.. నేరుగా అమ్మవారి దర్శనం పేరిట భక్తులకు శఠగోపం ..

Vijayawada:ఫేక్ పాస్ లను వేసుకుని నేరుగా డ్యూటీ పాస్ అంటూ ఒక్కొకరు ఇద్దరు ముగ్గురిని నేరుగా కొండపైకి తీసుకెళ్లి అమ్మవారి దర్శనం చేయించుకుని తీసుకు వస్తున్నారు...ఈ ఫేక్ పాస్ లతో డైరెక్ట్ దర్శనం అంటు భక్తుల నుండి డబ్బులు కుడా దండుకుంటున్నారు..ఆలయ సిబ్బంది తనిఖీల్లో ఈ నకిలీ పాస్ ల దందా బయటపడింది...చాలా మంది దగ్గర నకిలీ పాస్ లు ఉన్నట్లు గుర్తించారు

Andhra Pradesh: ఇంద్రకీలాద్రిపై నకిలీ పాస్‌ల దందా.. నేరుగా అమ్మవారి దర్శనం పేరిట భక్తులకు శఠగోపం ..
Fake Passes
P Kranthi Prasanna
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 16, 2023 | 12:28 PM

Share

విజయవాడ,అక్టోబర్16; దేవినవత్రుల్లో ఇంద్రకీలాద్రిపై నకిలీ పాస్ ల దందా బయటపడింది.. నిన్నటి నుండి ప్రారంభమైన దేవీ నవరాత్రులు 23 వ తేదీ వరకు జరగనున్నాయి…ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహించి సిబ్బందికి అయా విభాగాల నుండి పాస్ లు జారీ చేస్తారు…ఏ డిపార్ట్మెంట్స్ కు చెందిన వారు కొండపై ఎక్కడ విధులు నిర్వహిస్తారు.. అనే దానిపై అనుమతులు ఇస్తూ ఉన్నతాధికారుల సంతకాలు, స్టాప్ తో పాసులు జారీ చేస్తారు. ఈ పాస్ లు ఉన్నవారికి కొండపైకి నేరుగా అనుమతి ఉంటుంది..దీన్నీ ఆసరాగా చేసుకున్న కొంతమంది వ్యక్తులు ఈ పాస్ లను కూడా వ్యాపారంగా మార్చేశారు.

ఓర్జినల్ పాస్ లను పోలిన విధంగా నకిలీ పాస్ లు ముద్రించి అమ్మేస్తున్నారు…. దానిపై ఏలాంటి పేరు ఉండదు..ఏ అధికారి సంతకం కానీ, స్టాంప్ కానీ ఉండదు…ఫేక్ పాస్ లను వేసుకుని నేరుగా డ్యూటీ పాస్ అంటూ ఒక్కొకరు ఇద్దరు ముగ్గురిని నేరుగా కొండపైకి తీసుకెళ్లి అమ్మవారి దర్శనం చేయించుకుని తీసుకు వస్తున్నారు…ఈ ఫేక్ పాస్ లతో డైరెక్ట్ దర్శనం అంటు భక్తుల నుండి డబ్బులు కుడా దండుకుంటున్నారు…నిన్న ఆలయ సిబ్బంది తనిఖీల్లో ఈ నకిలీ పాస్ ల దందా బయటపడింది…చాలా మంది దగ్గర నకిలీ పాస్ లు ఉన్నట్లు గుర్తించారు ఆలయ సెక్యూరిటీ.. వారి వద్ద ఉన్న పాస్ లు ఫేక్ వా లేక డిపార్ట్మెంట్స్ నుండే స్టాప్ లు సంతకాలు లేని పాస్ లు బయటకు వచ్చాయా..? అనే దానిపై ఫోకస్ పెట్టారు అధికారులు..ఇంద్రకీలాద్రిపై ప్రతీ ఏడాది ఇదే పరిస్థితి కనిపిస్తుంది.. నకిలీ డ్యూటీ పాస్ లతో వచ్చే వారు వస్తూనే ఉంటారు.. కానీ, దీనిపై ఇప్పటి వరకు కట్టడి లేని పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉంటే,.. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల భారీగా ఉంటుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. కెనాల్‌ రోడ్డులోని వినాయకస్వామి ఆలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు క్యూలైన్లు ఏర్పా టు చేశారు. భక్తులంతా క్యూలైన్లలో ప్రశాంతంగా కొండపైకి చేరుకున్నాక.. ఘాట్‌రోడ్డులో ఓంకారం మలుపు వద్ద నుంచి ఐదు లైన్లలో దర్శనానికి వెళ్తారు. అమ్మవారి దర్శనం కోసం మూడు రకాల టిక్కెట్‌ ధరలను కేటాయించారు. రెండు ఉచిత దర్శన లైన్లు కూడా ఉన్నాయి. అయితే, ఈ పది రోజులు అంతరాలయం దర్శనం ఉండదని ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..