మీరు ఇష్టంగా తినే అన్నంతో కూడా అనర్థాలు తప్పవు..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..

అన్నం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ పెరుగుతుంది. ఇది నిద్రలేమి, నీరసానికి కారణమవుతుంది. అన్నం ఎక్కువగా తినడం వల్ల మీ బరువు కూడా పెరుగుతుంది. నెల రోజులు అన్నం తినడం మానేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Oct 16, 2023 | 1:46 PM

మన దేశంలో భోజనప్రియులు చాలా మందే ఉన్నారు.. మూడు పూటలా అన్నం తినేవారూ ఎక్కువగా ఉంటారు. ఏ తిండి తిన్నా అన్నం తిన్నట్టుగా ఉండనే వారు కూడా ఉన్నారు. అన్నం ఆరోగ్యానికి మంచిదన్నది నిజం. కానీ బియ్యం అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అన్నం ఎక్కువగా తినడం వల్ల అనేక వ్యాధులు ఎటాక్‌ చేసే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
అన్నంతో శరీరంలో కార్బోహైడ్రేట్స్‌ పెరుగుతాయి. దాంతో శరీరంలో షుగర్ లెవెల్స్‌ పెరిగి మధుమేహం సమస్య మొదలవుతుంది. అలాగే థైరాయిడ్, పీసీఓడీ బాధితులకు కూడా అన్నం మంచిది కాదు. ఏదైనా వ్యాధితో బాధపడేవారు శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి అన్నం తక్కువగా తినాలి. షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవాలి.

2 / 5
బరువు తగ్గాలనుకునే వారు నెల రోజులు అన్నం తినటం మానేస్తే.. త్వరగా బరువు తగ్గుతారు..కొద్ది రోజుల్లో తేడా మీకే తెలుస్తుంది. బియ్యం వేగంగా కేలరీలను పెంచుతుంది.. జీవక్రియను నెమ్మదిస్తుంది. ఇది పొట్ట కొవ్వు, ఊబకాయాన్ని పెంచుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే ఒక నెలపాటు అన్నం మానేయండి.

3 / 5
వైట్ రైస్ అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. వైట్ రైస్‌లో ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఉండవు. దీనివల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది.

4 / 5
అన్నం తినడం వల్ల బద్ధకం పెరుగుతుంది. తరచుగా నిద్ర వస్తుంది. దీనివల్ల పనిపై ఆసక్తి ఉండదు. కానీ, అన్నం తినడం మానేస్తే శరీరం మునుపటి కంటే చురుగ్గా మారుతుంది. సోమరితనం తగ్గుతుంది. కూర్చున్న, నిలబడినా నిద్ర మత్తు ఉండదు.

5 / 5
Follow us