IRCTC – Zomato: ఇక రైల్లోనూ జొమాటో ఫుడ్‌ డెలివరీ.. తొలుత ఆ ఐదు రైల్వే స్టేషన్లలో మాత్రమే!

రైల్వే ప్రయాణికులకు (IRCTC - Zomato) ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణ సమయంలో ఆహారం అందించేందుకు జోమాటోతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రైలు ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఆహార సరఫరా విషయంలో మరిన్ని ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్యాటెరింగ్‌ సిగ్మెంట్‌లో ప్రయాణికులు ముందుగా ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలను తెప్పించేందుకు ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటోతో భాగస్వామ్యం కుదుర్చుకొంది. ఈ ఒప్పందంలో..

IRCTC - Zomato: ఇక రైల్లోనూ జొమాటో ఫుడ్‌ డెలివరీ.. తొలుత ఆ ఐదు రైల్వే స్టేషన్లలో మాత్రమే!
Zomato-IRCTC E Catering
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 18, 2023 | 4:55 PM

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: రైల్వే ప్రయాణికులకు (IRCTC – Zomato) ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణ సమయంలో ఆహారం అందించేందుకు జోమాటోతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రైలు ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఆహార సరఫరా విషయంలో మరిన్ని ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్యాటెరింగ్‌ సిగ్మెంట్‌లో ప్రయాణికులు ముందుగా ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలను తెప్పించేందుకు ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటోతో భాగస్వామ్యం కుదుర్చుకొంది. ఈ ఒప్పందంలో భాగంగా తొలుత ఐదు ‘ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ (PoC)’ రైల్వే స్టేషన్లకు మాత్రమే ప్రాథమికంగా జొమాటో సేవలను పరిమితం చేసింది.

న్యూఢిల్లీ, ప్రయాగ్‌ రాజ్‌, కాన్‌పూర్‌, లక్నో, వారణాసి.. ఈ ఐదు రైల్వే స్టేషన్లలో మాత్రమే జొమాటో ప్రస్తుతానికి తన సేవలు వినియోగించనుంది. రానున్న రోజుల్లో మరిన్ని స్టేషన్లకూ జొమాటో సేవలు విస్తరించే అవకాశం ఉందని ఇండియన్‌ రైల్వేస్‌ ప్రకటించింది. ఐఆర్‌సీటీసీకి చెందిన ఈ-క్యాటరింగ్‌ సేవల కింద రైల్వే ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ప్రయాణ సమయంలో ఆర్డర్‌ చేసుకుని ఆరగించే సదుపాయం కల్పించింది. ప్రయాణ సమయంలో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకే ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

వాటిని జొమాటో సాయంతో ఆయా స్టేషన్లలో వారికి అందజేస్తారు. ఐఆర్సీటీసీ ఇ- కేటరింగ్‌ పోర్టల్‌ ద్వారా ఈ సదుపాయం కల్పించింది. ఆహారం అందించడం విషయంలో ప్రయాణికులకు ఎక్కువ ఆప్షన్లను అందించడంలో భాగంగానే జొమాటోతో అనుసందానం అయినట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. పండగ సీజన్‌ కావడంతో రైల్వే క్యాటరింగ్‌ సర్వీస్‌ ప్రత్యేక సేవలు, ఆఫర్లు అందిస్తోన్న సంగతి తెలిసిందే. నవరాత్రి సందర్భంగా ఉపవాసం చేసే వారి కోసం ఇండియన్‌ రైల్వేస్‌ ప్రత్యేక ‘థాలీ’ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో జొమాటో షేర్ ప్రైజ్‌ ఆరంభం రోజున 52 వారాల గరిష్ఠానికి రూ.115 వద్దకు చేరింది. దీంతో అమ్మకాలు తగ్గడంతో నష్టాల్లోకి వెళ్లింది. మరోవైపు ఐఆర్‌సీటీసీ షేరు కూడా 2 శాతం నష్టాల్లో కొనసాగుతోంది. గరిష్ఠంగా రూ.700 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!