AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: ఆ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. దీపావళి గిఫ్ట్‌ ప్రకటించిన మోదీ సర్కార్..

కేంద్ర ఉద్యోగులకు మోదీ సర్కార్ బంపర్ బొనాంజా గిఫ్ట్ అందించింది. నాన్-ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (అడ్హాక్ బోనస్)ను కేంద్ర నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. దీపావళికి ముందే కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఈ పెద్ద కానుక అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022-23 సంవత్సరానికి బోనస్‌గా రూ.7,000ను అందిస్తున్నట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం గరిష్ట పరిమితిని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గ్రూప్ బీ, గ్రూప్ సీల్లోకి వచ్చే నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు కూడా బోనస్ అందించింది

Good News: ఆ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. దీపావళి గిఫ్ట్‌ ప్రకటించిన మోదీ సర్కార్..
Money
Sanjay Kasula
|

Updated on: Oct 18, 2023 | 2:34 PM

Share

కేంద్ర ఉద్యోగులకు మోదీ సర్కార్ బంపర్ బొనాంజా గిఫ్ట్ అందించింది. నాన్-ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (అడ్హాక్ బోనస్)ను కేంద్ర నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. దీపావళికి ముందే కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఈ పెద్ద కానుక అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022-23 సంవత్సరానికి బోనస్‌గా రూ.7,000ను అందిస్తున్నట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం గరిష్ట పరిమితిని నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గ్రూప్ బీ, గ్రూప్ సీల్లోకి వచ్చే నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు కూడా బోనస్ అందించింది మోదీ కెబినెట్. ఇది కాకుండా, కేంద్ర పారామిలిటరీ బలగాలు, సాయుధ దళాల ఉద్యోగులకు అడహాక్ బోనస్ ప్రయోజనం కూడా ఇవ్వనుంది. ఈ బోనస్‌లో భాగంగా 30 రోజుల జీతంతో సమానంగా డబ్బు అందిస్తోంది.

ఆఫీస్ ఆర్డర్‌లో సమాచారం షేర్ చేశారు

గ్రూప్‌లోని కేంద్రాలకు 30 రోజుల జీతంతో సమానమైన బోనస్ ఇస్తున్నట్లుగా చెప్పింది. ఇది గ్రూప్ సి ఉద్యోగులకు కూడా  అందిస్తోంది. గ్రూప్ బికి చెందిన అన్ని నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు, ఉత్పాదకతతో అనుసంధానించబడిన బోనస్ పథకం పరిధిలోకి రాని వారు కూడా ప్రయోజనం పొందుతారు.

ఈ బహుమతిని బోనస్‌తో పొందవచ్చు

ఒకవైపు దీపావళికి ముందే కేంద్ర ఉద్యోగుల దీపావళిని మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు ఈరోజు బుధవారం ప్రభుత్వం నుంచి మరో భారీ ప్రకటన వెలువడింది. ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ పెంపు) పెంపుపై ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది. ఈసారి కేంద్ర ఉద్యోగుల డీఏలో 4 శాతం వరకు పెంచింది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి