‘ఆ బిడ్డ గుండె చప్పుడు ఆపలేం..’ 26 వారాల గర్భవిచ్ఛిత్తికి నో చెప్పిన సుప్రీం కోర్టు

26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి కోరుతూ వివాహిత పెట్టిన పిటీషన్‌ను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. గర్భంలోని శిశువు శారీరక వైకల్యం ఉన్నట్లు ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు గుర్తించింది. దీంతో గర్భవిచ్చిత్తికి అనుమతి కోరుతూ మహిళ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాచరించింది. ప్రస్తుతం ఆమెకు 28 వారాలు గర్భం కావడంతో మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (MTS) సమయం దాటినందువల్ల గర్భవిచ్చిత్తికి తిరస్కరించింది. చీఫ్‌ జస్టీస్‌ డీవై చంద్రచూద్‌..

'ఆ బిడ్డ గుండె చప్పుడు ఆపలేం..' 26 వారాల గర్భవిచ్ఛిత్తికి నో చెప్పిన సుప్రీం కోర్టు
Supreme Court
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 17, 2023 | 4:05 PM

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 17: 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి కోరుతూ వివాహిత పెట్టిన పిటీషన్‌ను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. గర్భంలోని శిశువు శారీరక వైకల్యం ఉన్నట్లు ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు గుర్తించింది. దీంతో గర్భవిచ్చిత్తికి అనుమతి కోరుతూ మహిళ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాచరించింది. ప్రస్తుతం ఆమెకు 28 వారాలు గర్భం కావడంతో మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (MTS) సమయం దాటినందువల్ల గర్భవిచ్చిత్తికి తిరస్కరించింది. చీఫ్‌ జస్టీస్‌ డీవై చంద్రచూద్‌ మాట్లాడుతూ.. గర్భ విచ్చిత్తి వ్యవధి 24 వారాలు. ఇప్పటికే గర్భస్థ శిశువుకు 26 వారాల 5 రోజులు ఉన్నాయి. ఈ కేసులో తల్లికి ఎటువంటి ముప్పూ లేదు.గర్భస్థ శిశువుకు కూడా ఎటువంటి అసాధారణ పరిస్థితి లేదని ఎయిమ్స్‌ వైద్యులు నిర్ధారించారు. గర్భ విచ్ఛిత్తికి అనుమతిస్తే మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్టులోని సెక్షన్‌ 3, సెక్షన్‌ 5 ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు.

ఇప్పటికే తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఈ ప్రసవాల అనంతరం ఆమె మానసిక ఆరోగ్యం సరిగా లేనందని, మరొక బిడ్డను పెంచే ఆర్థిక స్థోమత కూడా తమకు లేదని.. అందువల్లనే గర్భవిచ్చిత్తికి అనుమతి కోరుతూ 27 ఏళ్ల మహిళ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే గర్భస్థ శిశువు వయసు గుండె చప్పుడు నిలిపివేసేందుకు కోర్టు సముఖత తెలపలేదు. ప్రస్తుతానికి ఆ మహిళ ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారని, డెలివరీకి సంబంధించిన వైద్య ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ధర్మాసనం పేర్కొంది. డెలివరీ అనంతరం బిడ్డను దత్తత ఇచ్చేందుకు సుముఖంగా ఉంటే ఇవ్వవచ్చని లేదంటే పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పర్దివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.

కాగా MTP చట్టం ప్రకారం.. వివాహితలు, అత్యాచారానికి గురైనవారు, వికలాంగులు, మైనర్లు, శరీరకంగా బలహీనంగా ఉన్న మహిళలకు 24 వారాలలోపు అబార్షన్‌కు అనుమతి ఉంటుంది. తాజా కేసులో గర్భస్థ శిశువుకు 28 వారాలు కావడంతో అబార్షన్‌కు కోర్డు నిరాకరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.