సినీ పరిశ్రమలో విషాదం.. గుండె పోటుతో ప్రముఖ నటుడు మృతి

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు కుందర జానీ (71) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కేరళలోని కొల్లామ్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కుందర జానీ మృతి పట్ల మలయాళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ సోషల్ మీడియా వేదిక..

సినీ పరిశ్రమలో విషాదం.. గుండె పోటుతో ప్రముఖ నటుడు మృతి
Malayalam Film Actor Kundara Johny
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 18, 2023 | 4:07 PM

తిరువనంతపురం, అక్టోబర్ 18: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు కుందర జానీ (71) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కేరళలోని కొల్లామ్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కుందర జానీ మృతి పట్ల మలయాళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు.

కాగా కుందర జానీ సినీ కెరీర్‌ 1979లో నిత్య వసంతం మువీతో ప్రారంభమైంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో నటించి మెప్పించిన కుందర మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కుందర జానీ 1991లో వచ్చిన గాడ్‌ ఫాదర్‌ మువీతో ఆయన సినీ కెరీర్‌లో బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత వరసగా సినిమాల్లో ప్రతినాయకుడు (విలన్‌) పాత్రల్లోనే కనిపించారు. ముఖ్యంగా ఆయన నటించిన కిరీదమ్‌, చెన్‌కోల్‌ సినిమాలు బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ కొట్టాయి. కుందర మలయాళంలోనే కాకుండా తమిళంలోనూ పలు సినిమాల్లో నటించారు. మలయాళ చిత్రసీమలో 45 ఏళ్లకు పైగా నటించారు. కొల్లంలోని సాంస్కృతిక, సామాజిక వేదికల్లో కుందర నిరంతరం చురుకుగా ఉండేవారు. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. నాలుగు దశాబ్ధాలకుపైగా చిత్ర పరిశ్రమలో ఆయన ప్రముఖ నటులందరితో కలిసి తెరను పంచుకున్నారు. 2022లో విడుదలైన మెప్పడియాన్ ఆయన చివరి చిత్రం.

ఇవి కూడా చదవండి

అవన్ చండీయుడే మకన్, భార్గవచరితం మూన్నం ఖండం, బలరామ్ వర్సెస్ తారదాస్, ఆగస్ట్‌ 15, హెలో, భారత్‌ చంద్రన్‌ ఐపీఎస్‌, దడ సాహెబ్‌, క్రైం ఫైల్‌, తచ్చిలేదత్ చుండన్, సమంతారం, వర్ణప్పకిట్ట్, సాగరం సాక్షి, ఆనవల్ మోతిరమ్ లాంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. కనిపించారు. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో కూడా ఆయన నటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.