AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pavala Shyamala: దీనస్థితిలో నటి పావలా శ్యామల.. తినడానికి తిండిలేక పస్తులు.. సాయం కోసం ఎదురుచూపులు..

తన నటన, కామెడీతో వెండితెరపై అలరించిన ఆమె ఇప్పుడు నిస్సహాయస్థితిలో జీవిస్తోంది. ఓవైపు ఆర్థిక భారం.. మరోవైపు వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి. అదే సమయంలో తనను పోషించాల్సిన కూతురు మంచానికే పరిమితమవ్వడంతో ఆమె మనోవేదన వర్ణానాతీతం. ఇప్పటికే చాలాసార్లు ఆమె దీనస్థితి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోస్ బయటకు వచ్చాయి. దీంతో ఇండస్ట్రీ నుంచి ఆమెకు కొంతమంది ఆర్థికంగా సాయమందించారు.

Pavala Shyamala: దీనస్థితిలో నటి పావలా శ్యామల.. తినడానికి తిండిలేక పస్తులు.. సాయం కోసం ఎదురుచూపులు..
Pavala Shyamala
Rajitha Chanti
|

Updated on: Oct 18, 2023 | 3:52 PM

Share

సినీ పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఎంతోమంది తారలు.. చివరిదశలో మాత్రం ఎన్నో కష్టాలను వెల్లదీస్తుంటారు. ఇప్పుడు సీనియర్ నటి పావలా శ్యామల పరిస్థితి కూడా అంతే. ఒకప్పుడు ఎంతోమందికి సాయమందించిన ఆమె.. ఇప్పుడు సాయం చేసేవారి కోసం ఎదురుచూస్తోంది. తన నటన, కామెడీతో వెండితెరపై అలరించిన ఆమె ఇప్పుడు నిస్సహాయస్థితిలో జీవిస్తోంది. ఓవైపు ఆర్థిక భారం.. మరోవైపు వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి. అదే సమయంలో తనను పోషించాల్సిన కూతురు మంచానికే పరిమితమవ్వడంతో ఆమె మనోవేదన వర్ణానాతీతం. ఇప్పటికే చాలాసార్లు ఆమె దీనస్థితి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోస్ బయటకు వచ్చాయి. దీంతో ఇండస్ట్రీ నుంచి ఆమెకు కొంతమంది ఆర్థికంగా సాయమందించారు. కానీ అవి కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్గించాయి. ఇప్పటికీ ఆమెను ఆర్థిక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. దాదాపు 250కిపైగా సినిమాల్లో నటించి అలరించిన ఆమె.. ఇప్పుడు తనకు వచ్చిన అవార్డ్స్ అమ్ముకొని ఆ డబ్బుతో బియ్యం, పప్పులు కొనుకుందట.

అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని.. తినడానికి తిండి లేక ఒక్కోసారి ఐదు రోజులు పస్తులుండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది శ్యామాల. తినడానికి తిండి కూడా లేక కష్టాలు పడుతున్నా.. ఇక మందులు ఎక్కడి నుంచి కొనుక్కోగలమని బాధపడింది. ఇలాగే ఉంటే ఏదో ఒకరోజు ఇద్దరం మంచంలోనే ఆకలితో చనిపోతామని కన్నీళ్లు పెట్టుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోవడంలేదంటూ బాధపడింది. ప్రస్తుతం పావల శ్యామల ఫిర్జాదిగూడలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటుంది. ఆ ఆశ్రమానికి నెలవారీ డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు డబ్బు, మందులు నిత్యావసర సరుకులు మరేదైనా ఇచ్చి సాయపడాలనుకుంటే ఆమె ఇంటికే వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది.

పావలా శ్యామాల .. 1984లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ సహా దాదాపు 250 సినిమాల్లో నటించింది. గోపిచంద్ నటించిన గోలీమార్ సినిమాలో పావలా శ్యామాల కామెడీ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకున్న పావలా శ్యామాల ఇప్పుడు దీనస్థితిలో జీవనం కొనసాగిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.