Keedaa Cola Trailer: ‘కీడా కోలా’ ట్రైలర్ రిలీజ్.. కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ..
తరుణ్ భాస్కర్ రూపొందిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇక ఇటీవల విడుదలైన టీజర్‌తో సినిమాపై మరింత ఆసక్తిని కలిగించారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు తెప్పిస్తోంది.

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకులలో తరుణ్ భాస్కర్ ఒకరు. పెళ్లి చూపులు. ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో యూత్ అందర్నీ అలరించారు. ఇప్పుడు తన మూడు సినిమా ‘కీడా కోలా’ను అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మూవీని నవంబర్ 3న విడుదల చేయబోతున్నారు. తరుణ్ భాస్కర్ రూపొందిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇక ఇటీవల విడుదలైన టీజర్‌తో సినిమాపై మరింత ఆసక్తిని కలిగించారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు తెప్పిస్తోంది.
టైటిల్ లోని కీడా అంటే బొద్దింక అని అర్థం. బొద్దింక ఒక కోలాలో చిక్కుకొని కనిపిస్తుంది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ లో బ్రహ్మానందం, చైతన్య, రాగ్ మయూర్ మధ్య వచ్చే సన్నివేశాలు చూస్తుంటే కడుపుబ్బా నవ్వడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. అంతేకాకుండా.. చైతన్య రావు, రాగ్ మయూర్ ఏదో సమస్యలో చిక్కుకుని.. దాని నుంచి బయటపడేందుకు కోటి రూపాయాలు కట్టాల్సి వస్తుంది. మరోవైపు తరుణ్ భాస్కర్ రౌడీగా జైలు నుంచి బయటకు రావడం.. కార్పొరేటర్, బిజినెస్ మెన్ ఇలా సినిమాలో మూడు నాలుగు కథలు నడుస్తూ ఒకదానికొకటి లింక్ ఎలా ఉందనేది సినిమా చూస్తే తెలుస్తోంది.
Unleashing the madness of #KeedaaCola. Mothaa mogipovaali 💥🥁#KeedaaColaTrailer is here!https://t.co/WNeT1GvOcs#KeedaaColaOnNov3 🪳@TharunBhasckerD @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @SureshProdns @saregamasouth pic.twitter.com/a2RQIpDes7
— Rana Daggubati (@RanaDaggubati) October 18, 2023
ఇక ఈ సినిమాతో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరోసారి యూత్ ను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. క్రైమ్ కామెడీ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పణలో నవంబర్ 3న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతమందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.