AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehreen Pirzada: “దయచేసి తప్పుగా అర్ధం చేసుకోకండి”.. అభిమానులకు మెహ్రీన్ విజ్ఞప్తి

ఈ బ్యూటీ టాలీవుడ్ లో చాలా సినిమాలో చేసింది. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది మెహ్రీన్. ఆ తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. మెహ్రీన్ సినిమాలకే కాకుండా వెబ్ సిరీస్‌లకు కూడా డిమాండ్ ఉంది. ఇటీవలే ఆమె ఓటీటీ  ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మెహ్రీన్ మొదటి వెబ్ సిరీస్ ' సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ'  ఇటీవల విడుదలైంది.

Mehreen Pirzada: దయచేసి తప్పుగా అర్ధం చేసుకోకండి.. అభిమానులకు మెహ్రీన్ విజ్ఞప్తి
Mehreen
Follow us
Rajeev Rayala

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 19, 2023 | 6:34 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమగాద సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ  మెహ్రీన్ పిర్జాదా. ఈ బ్యూటీ టాలీవుడ్ లో చాలా సినిమాలో చేసింది. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది మెహ్రీన్. ఆ తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. మెహ్రీన్ సినిమాలకే కాకుండా వెబ్ సిరీస్‌లకు కూడా డిమాండ్ ఉంది. ఇటీవలే ఆమె ఓటీటీ  ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మెహ్రీన్ మొదటి వెబ్ సిరీస్ ‘ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’  ఇటీవల విడుదలైంది. అందులోని ఓ సన్నివేశాన్ని సోషల్ మీడియాలో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ సీన్ పై మెహ్రీన్ ను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.దాంతో మెహ్రీన్ విచారం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ వెబ్ సిరీస్‌లోని మ్యారిటల్ రేప్ సన్నివేశాన్ని సెక్స్ సీన్‌ అని కొందరు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు అని మెహ్రీన్ పిర్జాదా అసంతృప్తి వ్యక్తం చేసింది.” నా అభిమానులు ఈ వెబ్ సిరీస్‌ని చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. కొన్నిసార్లు మనం స్క్రిప్ట్ కోసం మా విధానాలకు వ్యతిరేకంగా ఏదైనా చేయాల్సి ఉంటుంది. నటనను కళగానూ, ఉద్యోగంగానూ భావించే ఆర్టిస్టులు దాన్ని చేయాల్సిందే. ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ అనే వెబ్ సిరీస్‌లో క్రూరమైన వివాహిత అత్యాచారానికి సంబంధించిన సన్నివేశం ఉంది. చాలామంది దీనిని సెక్స్ సన్నివేశంగా అభివర్ణించారు. దీంతో నేను హర్ట్ అయ్యాను అంటూ మెహ్రీన్ పిర్జాదా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.

ఇలాంటి కామెంట్స్ చేసే వారు వారికి కూడా అక్కా చెల్లెళ్ళు ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నటిగా పాత్రకు న్యాయం చేయడమే నా పని. దర్శకుడు మిలన్ లుథారియా చాలా ప్రొఫెషనల్‌గా ప్రవర్తించాడు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో, షూటింగ్ సమయంలో మేము ఇబ్బంది పడకుండా చూసుకున్నారు. ఎలాంటి పాత్రకైనా నా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తాను’ అని రాసుకొచ్చింది మెహ్రీన్.

అంతేకాదు ప్రత్యేక నోట్ కూడా రాసింది. ‘నా సినిమా పాత్ర కోసమే ఇదంతా చేశాను.ఈ  ఛాలెంజ్ నాకు నచ్చింది’ అని తెలిపింది మెహ్రీన్. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది మెహ్రీన్ అభిప్రాయంతో ఏకీభవించారు. ‘నువ్వు చాలా స్ట్రాంగ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. మెహ్రీన్ పిర్జాదా తమిళం, తెలుగు, కన్నడ, పంజాబీ, హిందీ సినిమాల్లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..