- Telugu News Photo Gallery Cinema photos Vijay Thalapathy LEO movie update on morning shows in tamilnadu Telugu Entertainment Photos
vijay Thalapathy – LEO: లియో సినిమాపై స్టాలిన్ సర్కార్ కుట్ర..? రిలీజ్ కి తంటాలు..
లియోపై తమిళనాడు ప్రభుత్వం కక్ష్య సాధిస్తుందా..? కావాలనే విజయ్ సినిమాని అక్కడ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుందా..? అదేంటి అలా అంటున్నారు..? రెండు రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ఇప్పుడిలాంటి అనుమానాలు ఎందుకొస్తున్నాయాబ్బా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇంతకీ ఏంటా సిచ్యువేషన్స్..? తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం లియో ఫీవర్ నడుస్తుంది. ఈ చిత్ర ప్రీ బుకింగ్స్ చూస్తుంటే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం అని తెలుస్తుంది.
Updated on: Oct 18, 2023 | 10:22 PM

లియోపై తమిళనాడు ప్రభుత్వం కక్ష్య సాధిస్తుందా..? కావాలనే విజయ్ సినిమాని అక్కడ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుందా..? అదేంటి అలా అంటున్నారు..? రెండు రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ఇప్పుడిలాంటి అనుమానాలు ఎందుకొస్తున్నాయాబ్బా అనుకోవచ్చు.

కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇంతకీ ఏంటా సిచ్యువేషన్స్..? తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం లియో ఫీవర్ నడుస్తుంది. ఈ చిత్ర ప్రీ బుకింగ్స్ చూస్తుంటే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం అని తెలుస్తుంది.

ముఖ్యంగా జైలర్ రికార్డులను సైతం ఈజీగానే క్రాస్ చేసేలా కనిపిస్తుంది లియో. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే 30 కోట్లు దాటిపోయింది. ఇదిలా ఉంటే తమిళనాట లియోను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.

తమిళనాట ఫస్ట్ డే 4 AM షోలకు పర్మిషన్ ఇవ్వలేదు సర్కార్. అయితే సంక్రాంతికి వారసుడు, తునివు వచ్చినపుడు.. ఫ్యాన్స్ మధ్య గొడవై ఒకరు చనిపోయారు.

అప్పట్నుంచి ఏ సినిమాకు ఉదయం 4, 7 షోలకు అనుమతి ఇవ్వట్లేదు ప్రభుత్వం. ఇదే లియోకు కూడా అప్లై అయిందంటున్నారు అధికారులు. మరోవైపు జైలర్‌కు కొన్నిచోట్ల టికెట్ రేట్లు పెంచారు.. కానీ లియోకు అది జరగడం లేదు.

టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మకూడదని.. అలా చేస్తే వెంటనే చెప్పాలని ఉత్తర్వులు జారీ చేసింది స్టాలిన్ సర్కార్. జైలర్‌కు లేని రూల్స్ లియోకు ఎందుకంటున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇవన్నీ ఉదయనిధికి రైట్స్ ఇవ్వకపోవడంతోనే వస్తున్నాయంటున్నారు వాళ్లు.

ముందు ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ కావడం.. తర్వాత షోస్ అనుమతి ఇవ్వకపోవడం.. ఇప్పుడు టికెట్ రేట్లు.. ఇవన్నీ చూస్తుంటే లియోను టార్గెట్ చేసారని అర్థమవుతుందంటున్నారు అభిమానులు.




