- Telugu News Photo Gallery Cinema photos Pains Me: Actor Mehreen Pirzada on social media trollings check story in pics in telugu
Mehreen Pirzada: అది శృంగార సీన్ ఎలా అవుతుంది.. ట్రోలర్స్‌కు మెహ్రీన్ గట్టి కౌంటర్
Mehreen Pirzada on Trolls: సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్‌లో నటించిన మెహ్రీన్, కథలో భాగంగా వచ్చే ఇంటిమేట్ సీన్స్ లో నటించారు. ఆ సీన్సే ఇప్పుడు మెహరీన్ పై ట్రోలింగ్ కు కారణం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా తనపై ట్రోల్స్ శృతిమించడంతో మెహ్రీన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ట్రోలర్స్‌కు గట్టిగానే ఇచ్చిపడేశారు.
Updated on: Oct 19, 2023 | 6:34 PM

డిజిటల్ ట్రెండ్‌లో శృంగార సన్నివేశాల విషయంలో హీరోయిన్స్ కాస్త బోల్డ్‌గా వ్యవహరించటం అన్నది కామన్ అయిపోయింది. తాజాగా హోమ్లీ ఇమేజ్ ఉన్న మెహరీన్ కూడా ఈ ట్రెండ్‌లోకి అడుగుపెట్టారు.

సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్‌లో నటించిన మెహ్రీన్, కథలో భాగంగా వచ్చే ఇంటిమేట్ సీన్స్ లో నటించారు. ఆ సీన్సే ఇప్పుడు మెహరీన్ పై ట్రోలింగ్ కు కారణం అవుతున్నాయి.

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ కు తొలి సినిమా తో హోమ్లీ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ఆ తరువాత ఎఫ్ 2, రాజా ది గ్రేట్, ఎఫ్ 3 సహా పలు చిత్రాల్లో నటించినా... ఎక్కువగా హుందాగా కనిపించే రోల్సే చేశారు మెహ్రీన్.

ఇలా గర్ల్ నెక్ట్స్ డోర్ ఇమేజ్ మెయిన్‌టైన్ చేస్తున్న బ్యూటీ సడన్ గా బోల్డ్ టర్న్ తీసుకోవటంతో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మెహ్రీన్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు కొంత మంది నెటిజెన్లు.

ఈ ట్రోల్స్ శృతిమించటం తో మెహ్రీన్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. 'కొన్ని కథలు కొన్ని సన్నివేశాలను డిమాండ్ చేస్తాయి. అలాంటప్పుడు తప్పని సరిగా ఆ సీన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం అర్ధం చేసుకోకుండా ట్రోల్ చేయటం సరికాదు' అంటూ క్లారిటీ ఇచ్చారు.

'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వైవాహిక అత్యాచారం నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్. అందులో భాగంగానే కొన్ని సన్నివేశాలు బోల్డ్‌గా చిత్రీకరించారు. ఆ సీన్స్ ను ఆడియన్స్ తప్పుగా అర్ధం చేసుకోవటం బాధ కలిగించింది' అంటూ క్లారిటీ ఇచ్చారు మెహ్రీన్.

ట్రోల్ చేస్తున్న వాళ్లకి కూడా అక్కా చెల్లెలు, కూతుళ్లు ఉంటారని భావిస్తున్నా... వాళ్లకి ఇలాంటి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. దారుణమైన అత్యాచార సన్నివేశం.. శృంగార సీన్ ఎలా అవుతుందంటూ అసహనం వ్యక్తంచేశారు.




