- Telugu News Photo Gallery Cinema photos Know Katrina Kaif’s handsome bodyguard Deepak Singh salary details here
katrina Kaif: కత్రినా బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా…? అందంలోనూ బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోడు..
Katrina Kaif Bodyguard Salary: టాప్ స్టార్స్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న కత్రినా కైఫ్ తన పర్సనల్ కేర్, సెక్యూరిటీ విషయంలో భారీగా ఖర్చు చేస్తున్నారు. ఎంచుకునే క్యారెక్టర్స్ పరంగా కత్రినా ఎక్కువగా అవుట్ డోర్ షూట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే తన సెక్యూరిటీ విషయంలో భారీగా ఖర్చు చేస్తున్నారు ఈ బ్యూటీ. చాలా కాలంగా దీపక్ సింగ్ అనే వ్యక్తి కత్రినా వ్యక్తి భద్రత బాధ్యతలు చూసుకుంటున్నారు.
Updated on: Oct 25, 2023 | 1:22 PM

ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో నెంబర్ వన్ ప్లేస్ కు పోటి పడుతున్న హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటారు కత్రినా కైఫ్. గ్లామర్ రోల్స్ తో పాటు యాక్షన్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ సూపర్ స్టార్ ఇమేజ్ ను టార్గెట్ చేస్తున్నారు ఈ బ్యూటీ.

టాప్ స్టార్స్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ తన పర్సనల్ కేర్, సెక్యూరిటీ విషయంలో భారీగా ఖర్చు చేస్తున్నారు. ఎంచుకునే క్యారెక్టర్స్ పరంగా కత్రినా ఎక్కువగా అవుట్ డోర్ షూట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే తన సెక్యూరిటీ విషయంలో భారీగా ఖర్చు చేస్తున్నారు ఈ బ్యూటీ.

ఇక వర్క్ విషయానికి వస్తే ప్రస్తుతం టైగర్ 3తో పాటు మేరి క్రిస్మస్ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు కత్రినా. దీపావళి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న టైగర్ 3 మూవీలో పాకిస్తాన్ ఏజెంట్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సల్మాన్‌తో పోటి పడి యాక్షన్ సీన్స్ లో నటించారు. మేరి క్రిస్మస్ సినిమాలో ఫస్ట్ టైమ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు కత్రినా.

ఇక వర్క్ విషయానికి వస్తే ప్రస్తుతం టైగర్ 3తో పాటు మేరి క్రిస్మస్ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు కత్రినా. దీపావళి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న టైగర్ 3 మూవీలో పాకిస్తాన్ ఏజెంట్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సల్మాన్‌తో పోటి పడి యాక్షన్ సీన్స్ లో నటించారు. మేరి క్రిస్మస్ సినిమాలో ఫస్ట్ టైమ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు కత్రినా.

ఈ మధ్యే పెళ్లి చేసుకొని పర్సనల్ లైఫ్ లోనే సెటిల్ అయ్యారు కత్రినా. యంగ్ హీరో విక్కీ కౌషల్ ను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ, పెళ్లి తరువాత కూడా ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా సినిమాలు కంటిన్యూ చేస్తున్నారు.

టాలీవుడ్ మూవీ మల్లీశ్వరితో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కత్రినా, ఆ సినిమాకు 60 లక్షల వరకు పేమెంట్ అందుకున్నారు. అలాంటిది ఇప్పుడు తన బాడీగార్డ్ కే ఏడాదికి కోటి రూపాయల పేమెంట్ ఇచ్చే స్థాయికి రావటం గ్రేట్ అచ్చీవ్‌మెంట్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

దీపక్ సింగ్ జీతం ఏడాదికి కోటి రూపాయలకు పైనే అంటున్నాయి బాలీవుడ్ సినీ వర్గాలు. షారూఖ్, సల్మాన్ లాంటి స్టార్స్ సెక్యూరిటీకి ఇస్తున్న పేమెంట్ తో పోలిస్తే ఇది చిన్న ఎమౌంటే అయినా... ఓ హీరోయిన్ తన సెక్యూరిటీ కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేయటం హాట్ టాపిక్ అవుతోంది.

చాలా కాలంగా దీపక్ సింగ్ అనే వ్యక్తి కత్రినా కైఫ్ వ్యక్తి భద్రత బాధ్యతలు చూసుకుంటున్నారు. అనుక్షణం ఆమె వెన్నంటే ఉంటూ ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన విషయంలో ఇంత కేర్ తీసుకుంటున్న దీపక్ కు భారీ సాలరీ ఇస్తున్నారు కత్రినా.



















