- Telugu News Photo Gallery Cinema photos Ram Charan going to Italy on Family vacation, will it effect shooting of Game Changer movie
Ram Charan: చరణ్ ఫ్యామిలీ ట్రిప్.. మరి గేమ్ చెంజర్ షూటింగ్ ఎప్పుడు ??
నిన్నగాక మొన్న గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ మొదలైందంటూ శంకర్ ట్వీట్ చేసారు.. అది చూసి మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ అంతలోనే మరోసారి ఇటలీ ట్రిప్ అంటూ ఫ్యామిలీతో పాటు ఫారెన్ వెళ్లిపోయారు రామ్ చరణ్. అసలేం జరుగుతుంది.. గేమ్ ఛేంజర్ షూటింగ్ మళ్లీ క్యాన్సిల్ అయిందా..? ట్రిప్ ఎన్ని రోజులు..? మళ్లీ న్యూ షెడ్యూల్ మొదలయ్యేదెప్పుడు..? గత వారమే గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ మొదలు పెట్టినా.. అనుకోని కారణాలతో మరోసారి ఇది క్యాన్సిల్ అయింది. దాంతో మరోసారి ఫ్రీ అయిపోయారు రామ్ చరణ్.
Updated on: Oct 20, 2023 | 1:06 PM

నిన్నగాక మొన్న గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ మొదలైందంటూ శంకర్ ట్వీట్ చేసారు.. అది చూసి మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ అంతలోనే మరోసారి ఇటలీ ట్రిప్ అంటూ ఫ్యామిలీతో పాటు ఫారెన్ వెళ్లిపోయారు రామ్ చరణ్. అసలేం జరుగుతుంది.. గేమ్ ఛేంజర్ షూటింగ్ మళ్లీ క్యాన్సిల్ అయిందా..? ట్రిప్ ఎన్ని రోజులు..? మళ్లీ న్యూ షెడ్యూల్ మొదలయ్యేదెప్పుడు..?

గత వారమే గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ మొదలు పెట్టినా.. అనుకోని కారణాలతో మరోసారి ఇది క్యాన్సిల్ అయింది. దాంతో మరోసారి ఫ్రీ అయిపోయారు రామ్ చరణ్.

మొన్నామధ్య ముంబై వెళ్లి ధోనీతో ఓ యాడ్ చేసిన ఈయన.. హైదరాబాద్ వచ్చాక శంకర్ సినిమా లొకేషన్స్‌లో జాయిన్ అవ్వాలనుకున్నారు కానీ ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. దాంతో ఫ్రీ టైమ్‌ను ఫ్యామిలీ ట్రిప్‌కు కేటాయించారు చరణ్.

తాజాగా సతీ సమేతంగా ఇటలీ వెళ్లారు రామ్ చరణ్. ఈ ట్రిప్‌కు ఓ స్పెషాలిటీ ఉంది. కూతురు క్లింకార పుట్టిన తర్వాత మొదటి ఫారెన్ ట్రిప్ ఇదే. ఇటలీలో ఉపాసన కజిన్ పెళ్లి కోసం ఈ ట్రిప్ వెళ్తున్నారు చరణ్. ఆ పెళ్లి చూసుకుని.. అట్నుంచి అటే వరుణ్ తేజ్ పెళ్లికి హాజరు కానున్నారు. నవంబర్ 1న ఇటలీలోనే వరుణ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరగనుంది.

ఉపాసన కజిన్ మ్యారేజ్, వరుణ్ తేజ్ పెళ్లి ఇవన్నీ అయ్యేసరికి 15 రోజులు పడుతుంది. అన్నీ పూర్తయ్యాక.. నవంబర్ ఫస్ట్ వీక్‌లో హైదరాబాద్ రానున్నారు రామ్ చరణ్. వచ్చిన తర్వాత గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ ప్లాన్ చేయబోతున్నారు శంకర్. ఈ లోపు ఫ్యాన్స్ కోసం దసరాకు ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. డిసెంబర్ నుంచి బుచ్చిబాబు సినిమా కూడా మొదలయ్యే అవకాశం ఉంది.




