- Telugu News Photo Gallery Cinema photos Fans saying Actor Nani upcoming movie is Tamil film Dada remake
Hi Nanna: నాని మొదలైన కొత్త తలనొప్పి.. ఆ సినిమాకు రీమేక్ అంటూ కామెంట్స్
దసరా లాంటి బిగ్గెస్ట్ హిట్ తరువాత నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న. నాని మార్క్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. ఏంటా తలనొప్పి అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ. దసరా సక్సెస్‌తో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాని, ప్రజెంట్ మరో ఇంట్రస్టింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమాతో తనకు బాగా పట్టున్న జానర్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పటికే హాయ్ నాన్న టీమ్ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసింది. టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Oct 20, 2023 | 12:45 PM

దసరా లాంటి బిగ్గెస్ట్ హిట్ తరువాత నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న. నాని మార్క్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. ఏంటా తలనొప్పి అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ.

దసరా సక్సెస్‌తో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాని, ప్రజెంట్ మరో ఇంట్రస్టింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమాతో తనకు బాగా పట్టున్న జానర్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్నారు.

ఇప్పటికే హాయ్ నాన్న టీమ్ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసింది. టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ టైమ్‌లో కోలీవుడ్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు మూవీ టీమ్‌కు తలనొప్పిగా మారాయి. హాయ్ నాన్న, ఓ తమిళ మూవీకి రీమేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు తమిళ జనాలు.

రీసెంట్‌గా రిలీజ్ అయిన హాయ్ నాన్న పోస్టర్, తమిళ మూవీ దాదా పోస్టర్ కాస్త సిమిలర్‌గా ఉండటంతో హాయ్ నాన్న, దాదాకు రీమేక్ అన్న ప్రచారం మొదలు పెట్టారు. అయితే నాని మూవీ టీమ్ మాత్రం ఫస్ట్ నుంచి హాయ్ నాన్న ఒరిజినల్ కథ అనే చెబుతోంది. దీంతో రీమేక్ వార్తలు చిత్రయూనిట్‌కు ఇబ్బంది కరంగా మారాయి.

ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్న హాయ్ నాన్న డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉండటంతో రీమేక్ రూమర్స్‌కు చెక్ పెట్టేలా నెక్ట్స్ అప్‌డేట్స్ ప్లాన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంలో చిత్రయూనిట్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.





























