- Telugu News Photo Gallery Cinema photos Keedaa Cola is upcoming movie in Crime and Comedy genre, will be a success at box office
Keedaa Cola: క్రైమ్ కామెడీ గా వస్తున్న కీడా కోలా.. సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతుందా ??
రొటీన్ సినిమాలు వారానికి ఒకటి వస్తూనే ఉంటాయి.. కానీ డిఫెరెంట్ సినిమాలను కూడా అప్పుడప్పుడూ చూడాలి కదా..? అలాంటి సినిమానే నేను మీకు చూపిస్తానంటున్నారు తరుణ్ భాస్కర్. ఈయన తెరకెక్కిస్తున్న కీడా కోలా ట్రైలర్ విడుదలైందిప్పుడు. అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది..? తరుణ్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా..? అసలీయన ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు..? రొటీన్ రెగ్యులర్ సినిమాలు తీసే దర్శకులు మన దగ్గర చాలా మంది ఉన్నారు. కానీ డిఫెరెంట్ థింకింగ్‌తో సినిమాలు చేసే దర్శకులు తక్కువే.
Updated on: Oct 20, 2023 | 11:12 AM

రొటీన్ సినిమాలు వారానికి ఒకటి వస్తూనే ఉంటాయి.. కానీ డిఫెరెంట్ సినిమాలను కూడా అప్పుడప్పుడూ చూడాలి కదా..? అలాంటి సినిమానే నేను మీకు చూపిస్తానంటున్నారు తరుణ్ భాస్కర్. ఈయన తెరకెక్కిస్తున్న కీడా కోలా ట్రైలర్ విడుదలైందిప్పుడు. అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది..? తరుణ్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా..? అసలీయన ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు..?

రొటీన్ రెగ్యులర్ సినిమాలు తీసే దర్శకులు మన దగ్గర చాలా మంది ఉన్నారు. కానీ డిఫెరెంట్ థింకింగ్‌తో సినిమాలు చేసే దర్శకులు తక్కువే. ఆ లిస్టులోనే తరుణ్ భాస్కర్ కూడా ఉన్నారు. అప్పుడెప్పుడో 8 ఏళ్ల కింద పెళ్లి చూపులు చేసి.. ఆ తర్వాత మూడేళ్లకు ఈ నగరానికి ఏమైంది అంటూ వచ్చి.. మరో ఐదేళ్లకు ఇప్పుడు కీడా కోలాతో వస్తున్నారు తరుణ్.

పెళ్లి చూపులు రేంజ్‌లో ఈ నగరానికి ఏమైంది హిట్ అవ్వలేదు కానీ కల్ట్ సినిమాలా నిలిచిపోయింది. దాంతో తరుణ్ భాస్కర్ మేకింగ్‌పై ఆడియన్స్‌లోనూ నమ్మక్ వచ్చేసింది. ఈ నమ్మకంతోనే కీడా కోలా అంటూ క్రైమ్ కామెడీ చేస్తున్నారీయన.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.. ఇందులో మెయిన్‌గా 8 కారెక్టర్స్ ఉంటాయి.. పూర్తిగా ఛాలెంజింగ్ కథతోనే వస్తున్నారు తరుణ్ భాస్కర్.

చిన్న సినిమా అయినా కూడా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో కీడా కోలా తెరకెక్కిస్తున్నారు తరుణ్ భాస్కర్. అంతేకాదు రొటీన్‌గా కాకుండా ఛాలెంజింగ్ స్క్రిప్ట్ చేయడానికి తను ఇష్టపడతానని.. అందుకే సినిమా సినిమాకు గ్యాప్ వస్తుందని చెప్పారీయన. నవంబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది. ట్రైలర్ చూస్తుంటే.. కీడా కోలా కూడా మ్యాజిక్ చేసేలాగే కనిపిస్తుంది.




