- Telugu News Photo Gallery Cinema photos Heroine Kangana Ranaut gets continues flops Details Here Telugu Actress Photos
Kangana Ranaut: కష్టాల్లో ఉన్న కంగనా రనౌత్.! హిట్ కోసం ఎదురుచూపులు..
లేడీ ఓరియంటెడ్ సినిమాతోనూ వంద కోట్ల వసూళ్లు సాధించే సత్తా ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ కంగనా రనౌత్. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ అంతా ఇలాగే ఫీల్ అయ్యింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. వరుస ఫెయిల్యూర్స్ ఈ బ్యూటీ కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి. కనీసం అప్ కమింగ్ సినిమాలకు బయ్యర్లు కూడా దొరకని సిచ్యుయేషన్‌లో ఉన్నారు ఫైర్ బ్రాండ్ లేడీ. ఒకప్పుడు వరుస విజయాలతో బాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ కంగనా రనౌత్.
Updated on: Oct 20, 2023 | 8:33 AM

లేడీ ఓరియంటెడ్ సినిమాతోనూ వంద కోట్ల వసూళ్లు సాధించే సత్తా ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ కంగనా రనౌత్. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ అంతా ఇలాగే ఫీల్ అయ్యింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. వరుస ఫెయిల్యూర్స్ ఈ బ్యూటీ కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి.

కనీసం అప్ కమింగ్ సినిమాలకు బయ్యర్లు కూడా దొరకని సిచ్యుయేషన్‌లో ఉన్నారు ఫైర్ బ్రాండ్ లేడీ. ఒకప్పుడు వరుస విజయాలతో బాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ కంగనా రనౌత్.

హీరోలకు కూడా వంద కోట్ల వసూళ్లు పెద్ద విషయం అనుకుంటున్న టైమ్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాతో వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసి రికార్డ్ సృష్టించారు ఈ బ్యూటీ. అయితే ఒకప్పుడు సూపర్ ఫామ్ చూపించిన కంగనా, కొద్ది రోజులుగా తడబడుతున్నారు.

ఈ బ్యూటీ చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్‌లో పెర్ఫామ్ చేయలేకపోతున్నాయి. 2019లో రిలీజ్ అయిన మణికర్ణిక తరువాత కంగనా ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన తలైవీ, ధాకడ్, చంద్రముఖి 2 లాంటి సినిమాలు కూడా ఫెయిల్ అవ్వటంతో కంగనా మార్కెట్ మీద ఎఫెక్ట్ పడింది. దీంతో అప్‌కమింగ్ సినిమాల బిజినెస్ విషయంలో ఇబ్బందులు ఎదరవుతున్నాయి.

ప్రజెంట్ ఏరియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన తేజస్‌తో పాటు రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఎమర్జెన్సీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు కంగనా.

అయితే ఈ రెండు సినిమాల బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగటం లేదు. మరి ఈ సినిమా రిలీజ్ తరువాతైన కంగనా మార్కెట్ బెటర్ అవుతుందేమో చూడాలి.




