- Telugu News Photo Gallery Cinema photos Actress Priya Prakash Varrier Next Movie update here Telugu Actress Photos
Priya Prakash Varrier: సోషల్ మీడియాలో ఉన్నంత జోష్ వెండితెరపై వింక్ గర్ల్ కు కరువైయ్యిందా.! ప్రియా హాట్ షో..
తొలి సినిమాతోనే నేషనల్ సెన్సేషన్‌గా మారిన మలయాళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. జస్ట్ అలా కన్ను గీటి హోల్ ఇండియాను షేక్ చేసిన ప్రియా... సినిమా అవకాశాల విషయంలో మాత్రం చాలా వెనకపడిపోయారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు ప్రియ ప్రకాష్. ఒరు అదార్ లవ్ సినిమాతో పాపులర్ అయిన మలయాల బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.
Updated on: Oct 20, 2023 | 8:32 AM

తొలి సినిమాతోనే నేషనల్ సెన్సేషన్‌గా మారిన మలయాళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. జస్ట్ అలా కన్ను గీటి హోల్ ఇండియాను షేక్ చేసిన ప్రియా... సినిమా అవకాశాల విషయంలో మాత్రం చాలా వెనకపడిపోయారు.

అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు ప్రియ ప్రకాష్. ఒరు అదార్ లవ్ సినిమాతో పాపులర్ అయిన మలయాల బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.

తొలి సినిమానే సెన్సేషన్ కావటంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. తొలి సినిమాతో వచ్చిన క్రేజ్‌తో తెలుగులో చెక్, ఇష్క్ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు మేకర్స్.

కానీ ఈ రెండు సినిమాలు ఫెయిల్ కావటంతో అమ్మడికి టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి. స్పెషల్ సాంగ్‌లో గ్లామర్ యాంగిల్ చూపించినా.. పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. బాలీవుడ్ అవకాశం కూడా ప్రియా ప్రకాష్‌కి పెద్దగా కలిసి రాలేదు.

శ్రీదేవి బంగ్లా పేరుతో ప్రియా ప్రకాష్ నటించిన సినిమా దాదాపు నాలుగేళ్లుగా రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్‌లో ఉంది. ఈ సినిమాలో శ్రీదేవి మరణాన్ని తప్పుగా చూపించారన్న విమర్శలు రావటంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.

రీసెంట్‌గా పవన్ కల్యాణ్, సాయి ధరమ్‌తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో నటించారు ఈ బ్యూటీ. కానీ ఈ మూవీ ప్రియా కెరీర్‌కు ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. బిగ్ స్క్రీన్ మీద కెరీర్ ఇబ్బందుల్లో పడటంతో సోషల్ మీడియాలో స్పీడు పెంచారు వింక్ బ్యూటీ.

వెకేషన్ టైమ్‌లో తీసుకున్న హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆన్‌లైన్‌లో జోరు చూపిస్తున్నారు. ఈ జోష్ సిల్వర్ స్క్రీన్ మీద అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.




