- Telugu News Photo Gallery Cinema photos Tollywood Music Director Thaman S next movie project update Telugu Entertainment Photos
Thaman S: థమన్ ను కంగారు పెడుతున్న గేమ్ ఛేంజర్..! ఎఫెక్ట్ గట్టిగానే ఉందిగా..
చాన్నాళ్లుగా రామ్ చరణ్ అభిమానులు కలలు కంటున్న రోజు రానే వచ్చింది.. ఎప్పుడు ఇంకెప్పుడు అంటూ గేమ్ ఛేంజర్ కోసం కలలు కంటున్న ఫ్యాన్స్‌కు ఇన్నాళ్లకు తీపికబురు చెప్పారు మేకర్స్. అయితే ఈ గుడ్ న్యూస్ థమన్‌ను కంగారు పెడుతుంది. మరి ఈ లింక్ ఏంటి..? గేమ్ ఛేంజర్ అప్‌డేట్.. థమన్‌ను ఎందుకు కంగారు పెడుతుందో చూద్దాం..?నేను మారిపోయాను సర్.. అప్పట్లా కాదు సర్.. ఇప్పుడు పూర్తిగా మారిపోయాను సర్ అంటున్నారు థమన్.
Updated on: Oct 18, 2023 | 10:21 PM

చాన్నాళ్లుగా రామ్ చరణ్ అభిమానులు కలలు కంటున్న రోజు రానే వచ్చింది.. ఎప్పుడు ఇంకెప్పుడు అంటూ గేమ్ ఛేంజర్ కోసం కలలు కంటున్న ఫ్యాన్స్‌కు ఇన్నాళ్లకు తీపికబురు చెప్పారు మేకర్స్.అయితే ఈ గుడ్ న్యూస్ థమన్‌ను కంగారు పెడుతుంది. మరి ఈ లింక్ ఏంటి..? గేమ్ ఛేంజర్ అప్‌డేట్.. థమన్‌ను ఎందుకు కంగారు పెడుతుందో చూద్దాం..?

నేను మారిపోయాను సర్.. అప్పట్లా కాదు సర్.. ఇప్పుడు పూర్తిగా మారిపోయాను సర్ అంటున్నారు థమన్. కానీ ఆయన మారిన విషయం తెలియాల్సింది ఆయనకి కాదు ప్రపంచానికి..! ప్రస్తుతం ఇది నిరూపించుకునే పనిలోనే బిజీగా ఉన్నారీయన.

మరీ ముఖ్యంగా థమన్ మారారా లేదా అనేది దసరాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు భగవంత్ కేసరి సినిమాతో పాటు.. గేమ్ ఛేంజర్ సాంగ్ విడుదల కానుంది. కొన్ని రోజులుగా థమన్ పాటలపై నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

సంక్రాంతికి వారసుడు, వీరసింహారెడ్డితో సత్తా చూపించిన ఈయన.. ఆ తర్వాత ఆ రేంజ్ మ్యాజిక్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన స్కందతో పాటు బ్రో సినిమాకు కూడా యావరేజ్ మ్యూజిక్ ఇచ్చారు థమన్.

దాంతో గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్‌తో ఆ ఇంప్రెషన్ పోగొట్టుకోవాలని చూస్తున్నారీయన. దసరాకు గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సాంగ్ కానీ క్లిక్ అయిందంటే.. థమన్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే. దాంతోపాటు భగవంత్ కేసరి కూడా థమన్‌కు కీలకమే. ఈ లెక్కన ఈ సారి దసరా థమన్‌కు బాగా ఇంపార్టెంట్ అన్నమాట.




