Petrol – Diesel Prices: అక్టోబర్ లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎందుకు తగ్గాయి.?
అక్టోబరు నెలలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పడిపోయాయి. అక్టోబరు 1 నుంచి 15వ తేదీ మధ్యకాలంలో వీటి అమ్మకాలు బాగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగంలోని మూడు చమురు సంస్థల గణాంకాల ప్రకారం.. గతేడాది అక్టోబర్ 1 నుంచి 15 వరకూ జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరు తొలి అర్ధ భాగంలో పెట్రోల్ విక్రయాలు 9 శాతం క్షీణించి 1.17 మిలియన్ టన్నులుగా ఉంది.
అక్టోబరు నెలలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పడిపోయాయి. అక్టోబరు 1 నుంచి 15వ తేదీ మధ్యకాలంలో వీటి అమ్మకాలు బాగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగంలోని మూడు చమురు సంస్థల గణాంకాల ప్రకారం.. గతేడాది అక్టోబర్ 1 నుంచి 15 వరకూ జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరు తొలి అర్ధ భాగంలో పెట్రోల్ విక్రయాలు 9 శాతం క్షీణించి 1.17 మిలియన్ టన్నులుగా ఉంది. డీజిల్ అమ్మకాలు 3.2 శాతం తగ్గి 2.99 మిలియన్ టన్నులకు చేరింది. 2022 అక్టోబర్‌లో దసరా, దీపావళి ఒకే నెలలో రావడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం అధికంగా జరిగింది. 2023 సెప్టెంబర్ నెల మొదటి అర్ధభాగంతో పోలిస్తే ఈ నెల మొదటి 15 రోజుల్లో పెట్రోల్ విక్రయాలు 9 శాతం తగ్గాయి. డీజిల్ అమ్మకాలు మాత్రం 9.6 శాతానికి పెరిగాయి. 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఈ నెల అర్ధ భాగంలో విమాన ఇంధన డిమాండ్ 5.7 శాతం దూసుకెళ్లి 2,95,200 టన్నుల అమ్మకాలను నమోదు చేసింది. రుతుపవనాలు రాకతో వ్యవసాయరంగంలో వర్షాకాలం డీజిల్ అమ్మకాలు క్షీణిస్తాయి. వర్షాలు కారణంగా వాహనాలు వినియోగం తగ్గుతుంది కనుక ఈ సీజన్‌లో డీజిల్ వినియోగం తగ్గింది. రుతుపవనాలు తిరోగమనం తర్వాత మళ్లీ నెలవారీగా డీజిల్ వినియోగం పెరిగింది. 2023 అక్టోబర్‌లో 1 నుంచి 15 తేదీల మధ్య పెట్రోల్ వినియోగం పెరిగింది. 2021 అక్టోబర్‌తో పోలిస్తే 12 శాతం, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 21.7 శాతం పెరిగింది. అలాగే డీజిల్ వాడకం 2021 అక్టోబర్‌తో పోలిస్తే 23.4 శాతం, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 23.1 శాతం అధికమైంది. విమాన ఇంధన వినియోగం 2021 అక్టోబర్‌తో పోలిస్తే 36.5 శాతం అధికం కాగా, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 6.6 శాతం తక్కువ నమోదైంది. వంటకు ఉపయోగించే ఎల్‌పీజీ విక్రయాలు 1.2 శాతం పెరిగి 1.25 మిలియన్ టన్నులుగా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..