Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా గిఫ్ట్.. గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను..
ఆగస్టు 28వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో భాగంగా మొత్తం 508 పోస్టుల భర్తీకీ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. పలు విభాగాల్లో ఉన్న 508 ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం జీవో 98ని జారీ చేసింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీల నేపథ్యంలో గ్రూప్2 ఖాళీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మరో...
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి దసరా కానుక ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ -2 ద్వారా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆగస్టు 28వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో భాగంగా మొత్తం 508 పోస్టుల భర్తీకీ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. పలు విభాగాల్లో ఉన్న 508 ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం జీవో 98ని జారీ చేసింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీల నేపథ్యంలో గ్రూప్2 ఖాళీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మరో 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం 720 పోస్టులకు త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.
గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను పెంచే నేపథ్యంలో మరోసారి శాఖలవారీగా జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల ఖాళీల వివరాలు సేకరించింది ప్రభుత్వం. ఆయా శాఖల నుంచి మొత్తం 212 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో గతంలో అనుమతిచ్చిన 508 పోస్టులకు అదనంగా మరో 212 పోస్టులను కలిపి భర్తీ చేసేలా ఏపీపీఎస్సీకి అనుమతిస్తూ జీవో 112 జారీ చేసింది ప్రభుత్వం. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వనుంది.
పెరిగిన ఖాళీలు ఎక్కడెక్కడంటే..
వ్యవసాయ శాఖ (9), మత్య్సశాఖలో 10, సివిల్ సప్లయిస్‌లో 8, ఏపీపీఎస్సీలో 30, హోం శాఖలో 22, ఉన్నతవిద్యాశాఖలో 1, వైద్యారోగ్యశాఖలో 21, కార్మిక శాఖలో 13, మున్సిపల్ శాఖలో 9, మైనార్టీ శాఖలో 2, పంచాయతీ రాజ్ శాఖలో 5, ప్లానింగ్ శాఖలో 5, రెవెన్యూ శాఖలో 31, పాఠశాల విద్యాశాఖలో 33, సోషల్ వెల్ఫేర్‌లో 1, రోడ్లు-భవనాలు 7, మహిళా శిశుసంక్షేమ శాఖలో 2, జలవనరుల శాఖలో 1, యువజన సర్వీసుల శాఖలో 1 ఖాళీలు ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..