PUBG Love Story: ‘సీమ పాకిస్థాన్‌కు రావాలి.. రెండు దేశాల మధ్య యుద్ధం కోరుకుంటున్నారా?’ పాక్‌ మహిళ సీమా అసలు భర్త ఆగ్రహం

పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా అనే యువకుడితో పబ్జీలో ఏర్పడిన పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. దీంతో సీమా హైదర్‌ పాకిస్థాన్‌లోని తన ఇంటిని విక్రయించి, తన నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లోని ప్రియుడిని కలిసేందుకు అక్రమ మార్గంలో బోర్డర్ దాటి దేశంలోకి ప్రవేశించింది. వీరి ఇద్దరి ప్రేమ వ్యవహారం రెండు దేశాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో యూపీలోని నోయిడాలో ఉన్న సీమా కొత్త ఇంటిని నిర్మించుకుని ప్రియుడితో కలిసి జీవిస్తోంది. తన కొత్త ఇంటిని గురించిన విషయాలు సోషల్ మీడియాలో..

PUBG Love Story: 'సీమ పాకిస్థాన్‌కు రావాలి.. రెండు దేశాల మధ్య యుద్ధం కోరుకుంటున్నారా?' పాక్‌ మహిళ సీమా అసలు భర్త ఆగ్రహం
Seema Haider Love Story
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 20, 2023 | 6:28 PM

నోయిడా, అక్టోబర్‌ 20: పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా అనే యువకుడితో పబ్జీలో ఏర్పడిన పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. దీంతో సీమా హైదర్‌ పాకిస్థాన్‌లోని తన ఇంటిని విక్రయించి, తన నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లోని ప్రియుడిని కలిసేందుకు అక్రమ మార్గంలో బోర్డర్ దాటి దేశంలోకి ప్రవేశించింది. వీరి ఇద్దరి ప్రేమ వ్యవహారం రెండు దేశాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో యూపీలోని నోయిడాలో ఉన్న సీమా కొత్త ఇంటిని నిర్మించుకుని ప్రియుడితో కలిసి జీవిస్తోంది. తన కొత్త ఇంటిని గురించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని బట్టి చూస్తే సీమ ఇండియాలో సెటిల్ అవ్వాలని గట్టాగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌ను వదిలి పాకిస్థాన్‌కు వెళ్లకపోవడంపై సౌదీ అరేబియాలో ఉన్న సీమా అసలు భర్త గులాం హైదర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీడియాతో గులాం హైదర్ మాట్లాడుతూ,

తాను భారత్‌కు రావాలని చాలా ప్రయత్నించానని, అయితే వీసా రాలేదని గులాం హైదర్ మీడియాకు తెలిపాడు. వీసా కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నానని, సీమా హైదర్‌ వద్ద ఉన్న పిల్లలు నా పిల్లలేనని గులాం చెప్పాడు. భారత్‌కు వచ్చి ఆమె వద్ద నుంచి తన పిల్లలను తీసుకుంటానని చెప్పాడు. కొందరు తన భార్య సీమను రెచ్చగొట్టి తన నుంచి దూరం చేస్తున్నారని, ఆమె తన నుంచి విడాకులు తీసుకోలేదని అన్నాడు. తనతో విడాకులు తీసుకోకుండా వేరొకరిని ఎలా వివాహం చేసుకుంటుందని ప్రశ్నించాడు. సీమా పాక్‌ నుంచి పారిపోయి భారత్‌కు వచ్చిందని, ఇది చట్టవిరుద్ధమని ఆమె భర్త గులాం హైదర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సీమ పాకిస్థాన్‌కు రావాలి: గులాం హైదర్

సీమా భారత్‌ను వదిలి పాకిస్థాన్‌కు రావాల్సిందిగా గులాం హైదర్ డిమాండ్‌ చేశాడు. లేదంటే.. ఆమెను సీమా హైదర్ అని పిలవవద్దని, సీమ సచిన్ మీనా అని పిలవాలని గులాం హైదర్‌ డిమాండ్‌ చేశాడు. ఆమెకు తానింకా విడాకులు ఇవ్వలేదని, చట్టబద్ధంగా ఆమె తన భార్య అని అన్నాడు. భారత్‌ నుంచి ఇద్దరు, ముగ్గురు న్యాయవాదులను తన భార్య సీమా నియమించుకుందని, ఎప్పటికైనా నిజం, న్యాయం మాత్రమే గెలుస్తుందని అన్నాడు. సీమా దారుణంగా ప్రవర్తిస్తోంది.. అలాంటి పెళ్లిని ఎవరు అంగీకరిస్తారు? భారత్‌లో కోర్టులు లేవా? అంటూ ప్రశ్నించాడు. సీమా సచిన్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌పై కూడా గులాం హైదర్ ప్రశ్నలు సంధించాడు. మీరు రెండు హిందూ-ముస్లిం దేశాల మధ్య యుద్ధాన్ని సృష్టించాలనుకుంటున్నారా అని ప్రశ్నించాడు. చౌకబారు టీఆర్పీ కోసమే ఇదంతా చేస్తున్నారా? ఎవరైనా తమ దేశం విడిచి వెళ్లవచ్చని, దానిని సమర్థించుకోవచ్చని ఏ చట్టంలో చెప్పారంటూ భారత్‌లోని తన భార్య సీమా నియమించుకున్న లాయర్లను ఉద్దేశిస్తూ మాట్లాడాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి