Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Namo Bharat: ఢిల్లీ-మీరట్‌ మధ్య పట్టాలెక్కెన నమోభారత్‌ రైళ్లు.. జెండా ఊపి రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Inaugurates Namo Bharat: వందేభారత్ ఎక్స్ప్రెస్ తర్వాత దేశంలో పట్టాలెక్కుతున్న మరో హైస్పీడ్ రైలు ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. తొలిదశలో ఢిల్లీ- ఘజియాబాద్ మార్గంలో సాహిబాబాద్- దుహై డిపో మధ్య ఈ రైలును నడపనున్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

Namo Bharat: ఢిల్లీ-మీరట్‌ మధ్య పట్టాలెక్కెన నమోభారత్‌ రైళ్లు.. జెండా ఊపి రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Inaugurates Namo Bharat
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 20, 2023 | 12:31 PM

న్యూఢిల్లీ/ఘజియాబాద్, అక్టోబర్ 20: దేశంలోనే తొలి ర్యాపిడ్ రైలు (నమో భారత్)ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సమయంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరి కూడా పాల్గొన్నారు. మొదటి దశలో  సిద్ధం చేసిన 17 కి.మి కారిడార్ సాహిబాబాద్ నుంచి దుహై వరకు పనిచేస్తుంది. ఇది నమో భారత్‌గా పేరు పెట్టారు. భారతదేశపు మొట్టమొదటి రాపిడ్‌ఎక్స్ రైలు ఇదే.

ఘజియాబాద్‌లోని వసుంధర సెక్టార్‌-8లో నిర్మించిన స్టేషన్‌ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ‘నమో భారత్‌’ను జెండా ఊపి ప్రారంభించారు. శనివారం నుంచి సామాన్య ప్రజల కోసం ర్యాపిడ్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ ప్రయాణం 12 నిమిషాల్లో పూర్తవుతుంది. ఈ కారిడార్ పొడవు 82 కి.మీ. ఇందులో 14 కి.మీ ఢిల్లీలో మరియు 68 కి.మీ ఉత్తరప్రదేశ్‌లో ఉంది.

పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ సౌకర్యం కలిగిన నమో భారత్ రైళ్లలో ఇరువైపులా 2×2 లేఅవుట్లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్ ర్యాక్లు ఉంటాయి. సీసీటీవీలు, ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ వ్యవస్థ, ఛార్జింగ్ పాయింట్లు వంటి అధునాతన సౌకర్యాలు కల్పించారు. ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుంది. ఈ రైళ్ల గరిష్ఠ వేగం 160 కి.మీ. అయినా.. అంతకంటే కొంచెం తక్కువ వేగంతోనే నడపునున్నట్టు అధికారులు వెల్లడించారు.

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) NCRలో ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) యొక్క నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది, ఇది ఢిల్లీ మెట్రో యొక్క వివిధ మార్గాలతో అనుసంధానించబడుతుంది. ఇది అల్వార్, పానిపట్ మరియు మీరట్ వంటి నగరాలను ఢిల్లీకి కలుపుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..