Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Station: రైల్వే స్టేషన్‌లో రైలు ఆపడం మరచిపోయిన లోకో పైలెట్.. ప్రయాణీకులు భయంతో కేకలు

ఛప్రా తర్వాత దాని మొదటి షెడ్యూల్ స్టాపేజ్‌లో ఆగిన తర్వాత.. అక్కడ నుంచి మాంఝీ హాల్ట్‌కు బయలుదేరింది. రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు మాంఝీ హాల్ట్‌లో కూర్చుని వేచి చూస్తున్నారు. ఆ స్టేషన్ లో దిగాల్సిన వారు తమ సామానుతో దిగడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాంఝీ హాల్ట్‌లో రైలు ఆగలేదు. దీంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది.

Railway Station: రైల్వే స్టేషన్‌లో రైలు ఆపడం మరచిపోయిన లోకో పైలెట్.. ప్రయాణీకులు భయంతో కేకలు
Chapra Utsarg Express
Follow us
Surya Kala

|

Updated on: Oct 20, 2023 | 11:17 AM

దేశ వ్యాప్తంగా గత కొంతకాలంగా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ రైలు ప్రమాదాల కేసుల సంఖ్య ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు.  బీహార్‌లోని బక్సర్‌లో జరిగిన రైలు ప్రమాదం నుంచి రైల్వే సరిగ్గా కోలుకోలేదు. ప్రయాణీకులు ఇంకా తేరుకోలేదు. అయినప్పటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యం కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఛప్రాలోని లోకో పైలట్ స్టేషన్‌లో రైలు ఆగకుండా ముందుకు సాగింది. అనంతరం డ్రైవర్ తన తప్పును గుర్తించడంతో రైలుని వంతెన మధ్యలో ఆపాడు. ఆ తర్వాత రైలు దాదాపు 20 నిమిషాల పాటు వంతెనపైనే నిలిచిపోయింది. ఈ సమయంలో రైలులో కూర్చున్న ప్రయాణికులకు ఏమైయిందో తెలియక అయోమయానికి గురయ్యారు. అసలు విషయం తెలుసుకుని ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్టేషన్‌లో రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు తమ ప్రయాణం గురించి అయోమయానికి గురయ్యారు.

ఛప్రాలోని మాంఝీ హాల్ట్ సమీపంలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. వాస్తవానికి ఛప్రా బల్లియా రైల్వే సెక్షన్‌లో నడుస్తున్న ఉత్సర్గ్ ఎక్స్‌ప్రెస్ బుధవారం సాయంత్రం ఛప్రా నుండి ఫరూఖాబాద్‌కు బయలుదేరింది. ఛప్రా తర్వాత దాని మొదటి షెడ్యూల్ స్టాపేజ్‌లో ఆగిన తర్వాత.. అక్కడ నుంచి మాంఝీ హాల్ట్‌కు బయలుదేరింది. రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు మాంఝీ హాల్ట్‌లో కూర్చుని వేచి చూస్తున్నారు. ఆ స్టేషన్ లో దిగాల్సిన వారు తమ సామానుతో దిగడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాంఝీ హాల్ట్‌లో రైలు ఆగలేదు. దీంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది.

వంతెనపై ఆగిన రైలు

లోకో పైలట్ తన తప్పును గుర్తించడంతో.. అతను సరయూ నదిపై ఉన్న వంతెనపై రైలును ఆపాడు. దాదాపు 20 నిమిషాల పాటు రైలు ఆ వంతెనపై నిలిచిపోయింది. అనంతరం రైలు లోకో పైలట్ రైల్వే అధికారులతో మాట్లాడి రైలును మళ్లీ మాంఝీ హాల్ట్ స్టేషన్‌కు తీసుకొచ్చాడు. రైలు లోకో పైలట్, గార్డు పరస్పరం సమన్వయంతో రైలును మాంఝీకి తిరిగి తీసుకువచ్చారు.

ఇవి కూడా చదవండి

విచారణకు ఆదేశించిన DRAM వారణాసి

రైలు ముందుకు కదులుతూ బ్రిడ్జిపై 20 నిమిషాల పాటు నిలబడిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో డ్రామ్ వారణాసి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కేసులో నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..