Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2023: నవరాత్రుల్లో ఆరో రోజు కాత్యాయని దేవిగా అమ్మవారు.. ఇలా పూజిస్తే కోరుకున్న వరుడు వస్తాడట..

తెల్లవారుజామున నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, గుడితో సహా ఇల్లంతా గంగాజలంతో శుద్ధి చేయండి. దీని తరువాత అమ్మవారికి స్వచ్ఛమైన నీటితో స్నానం చేయించి, పసుపు బట్టలు ధరింపజేయండి. దీని తరువాత కుంకుమ, అక్షతలు, ఎర్రటి పువ్వులు సమర్పించి నెయ్యి దీపం వెలిగించండి. చివరగా, కర్పూర దీపం వెలిగించి కాత్యాయనికి హారతిని ఇవ్వండి.

Navaratri 2023: నవరాత్రుల్లో ఆరో రోజు కాత్యాయని దేవిగా అమ్మవారు.. ఇలా పూజిస్తే కోరుకున్న వరుడు వస్తాడట..
Katyayani Devi
Follow us
Surya Kala

|

Updated on: Oct 21, 2023 | 8:45 AM

ఈరోజు నవరాత్రుల ఆరవ రోజు.  కాత్యాయని దేవిని దుర్గమ్మ ఆరవ రూపంగా భావించి పూజిస్తారు. ఏ భక్తుడైనా కాత్యాయనీ దేవిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే అతని లోని అన్ని రోగాలు, దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని నమ్మకం. అంతేకాదు కాత్యాయని దేవి ఆరాధన చేయడం వలన వివాహం కానీ యువతి  కోరుకున్న వరుడిని పొందడానికి ఉత్తమంగా పరిగణించబడుతుంది.

కాత్యాయనీ దేవి..  భగవతి మహర్షి కాత్యాయన ఇంటిలో కుమార్తెగా జన్మించింది. అమ్మవారి తన కుమార్తెగా కావాలని.. కాత్యాయన మహర్షి కఠోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన దుర్గాదేవి అతని ప్రార్థనను అంగీకరించి అతని ఇంట్లో కుమార్తెగా జన్మించింది. దీని తరువాత ఆమె పేరు కూడా కాత్యాయని అయింది. కాత్యాయని దేవి   4 చేతులతో ఆయుధం,  కమలం ధరించి ఉంటుంది. సింహంపై స్వారీ చేస్తుంది.

కాత్యాయని తల్లికి ఏ రంగు , ఆహారం ఇష్టమంటే

కాత్యాయనికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అటువంటి పరిస్థితిలో ఈ రోజు అమ్మవారిని ఎరుపు రంగు దుస్తులను సమర్పించండి. ఇలా చేయడం వలన అమ్మవారు సంతోషపడతారు. ఆశీర్వాదాన్ని ఇస్తారు. అంతేకాదు కాత్యాయని తేనె అంటే చాలా ఇష్టం. ఈరోజు కాత్యాయనికి తేనె సమర్పించండి. ఇలా చేయడం వలన వ్యక్తిత్వంలో సానుకూల మార్పులను తెస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎలా పూజించాలంటే

తెల్లవారుజామున నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, గుడితో సహా ఇల్లంతా గంగాజలంతో శుద్ధి చేయండి. దీని తరువాత అమ్మవారికి స్వచ్ఛమైన నీటితో స్నానం చేయించి, పసుపు బట్టలు ధరింపజేయండి. దీని తరువాత కుంకుమ, అక్షతలు, ఎర్రటి పువ్వులు సమర్పించి నెయ్యి దీపం వెలిగించండి. చివరగా, కర్పూర దీపం వెలిగించి కాత్యాయనికి హారతిని ఇవ్వండి. ధ్యానం చేయండి. కాత్యాయనికి తేనెను సమర్పించండి. ఇలా చేయడం వలన అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది.

నేటి మంత్రం కాత్యాయని మాత పూజ సమయంలో ఈ మంత్రాన్ని జపించండి.

స్వర్ణాజ్ఞా చక్ర స్థితం షష్టం దుర్గా త్రినేత్రం. వరాభీత కరాం శగపదధరం కాత్యాయనసుతాం భజామి॥ స్వర్ణజ్ఞ చక్ర స్థితం షష్టం దుర్గా త్రినేత్రమ్ । వరాభిత్ కరం షడ్గపద్మధరం కాత్యాయన్సుతం భజామి అని పఠించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.