Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Mukunda Murari October 20th, 2023: మురారీ శవాన్ని ఇంటిలో అప్పగించిన పోలీసులు.. కృష్ణ మీద కోపంగా ఉన్న ఫ్యామిలీ

రేవతి మురారీ అంటూ ఏడుస్తూ.. చూశావా అక్కా మీ కొడుకు మనల్ని ఎంత అన్యాయం చేశాడో అని ఏడుస్తుంటే.. నన్ను క్షమించండి అత్తయ్య మీ కొడుకు బతికే ఉన్నాడు అని ముకుంద తనలో తాను అనుకుంటుంది. ఈ అమ్మని వదిలేసి వెళ్లిపోయావా అని అంటూ రేవతి ఏడుస్తుంది. మురారీ బాడీ కాదని గుర్తు పడతారా అని ముకుంద భయపడుతుంటే.. ఇదేమిటండి ఫోన్ కూడా చెయ్యని మురారీకి ఇలా అయింది అని సుమ బాధపడుతుంది.

Krishna Mukunda Murari October 20th, 2023: మురారీ శవాన్ని ఇంటిలో అప్పగించిన పోలీసులు.. కృష్ణ మీద కోపంగా ఉన్న ఫ్యామిలీ
Krishna Mukunda MurariImage Credit source: Hotstar
Follow us
Surya Kala

|

Updated on: Oct 21, 2023 | 8:05 AM

సృహ వచ్చిన కృష్ణ.. ఏసీపీ సార్ ఎక్కడ .. ఇక్కడే ఉన్నారా.. పక్క రూమ్ లో ఉన్నారా అంటూ పిన్ని బాబాయ్ లను అడుగుతుంది. అప్పుడు తమ కారుని లారీ గుద్దినట్లు.. తనతో పాటు మురారీ ఉన్నాడని కృష్ణ చెబుతుంది. తన భర్తను వెదకడానికి వెళ్తానని కృష్ణ రెడీ అవుతుంటే.. ప్రభాకర్ నేను వెళ్తాను నువ్వు కదలవద్దు అంటూ బయలు దేరతాడు.

రేవతిపై ఫైర్ అయిన భవానీ..

నువ్వు నాకు నిజం చెప్పకుండా దాచింది నాకు నచ్చలేదు నేను నిన్ను క్షమించను అని రేవతిని భవానీ అంటుంది. రేవతి వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు ప్రేమించుకున్నారు.. సో నేను కాంట్రాక్ట్ మ్యారేజ్ అనేది పెద్ద విషయంగా పట్టించుకోలేదు  అని అంటే.. ప్రసాద్ ఈ విషయాన్నీ ఈశ్వర్ కు చెప్పవా అని అంటుంది. చెప్పా వదిన ప్రసాద్ సమాధానం చెబుతాడు. ముకుంద మరోవైపు దేవుడిని ప్రార్ధిస్తూ.. నేను చేస్తుంది తప్పని తెలుసు.. కానీ అన్నయ్య ఒప్పుకోవడం లేదు.. నాకు తప్పడం లేదు.. ఈ ఇంట్లో వాళ్లకు ఏమీ జరగకుండా చూడు అని దణ్ణం పెట్టుకుంటుంటే.. అంబులెన్స్ సౌండ్ విని.. మన ఇంటికి ఎందుకు వస్తుంది అని అంటుంది భవానీ.. ఏమో వదినా అంటూ .. అందరూ బయటకు వస్తారు.

మురారీకి యాక్సిడెంట్

మురారీ వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయింది.. అని శవాన్ని ఇంటికి తీసుకుని వస్తారు పోలీసులు.. పాకెట్ లో ఈ పర్స్ చూసి తీసుకొచ్చామండి అని అంటున్న పోలీసుతో రేవతి ఏయ్ ఏమి మాట్లాడుతున్నావు.. అని అంటుంటే.. యాక్సిడెంట్ లో ముఖం అంతా ఛిద్రం అయిపొయింది అని చెబుతాడు. నా బిడ్డకు ఇలా కావడం ఏమిటి అని రేవతి అంటుంటే.. మాములుగా అయితే మున్సిపాలిటీ వాళ్ళు దహన సంస్కారాలు చేసేవారు.. ఏసీపీ సార్ అని తెలిసాక ఇక్కడికి తీసుకొచ్చాము.. డాక్టర్ గారు సర్టిఫై చేసి సర్టిఫికెట్ ఇచ్చారు ఇదిగోండి సార్ అని ప్రసాద్ కు ఇస్తాడు పోలీసులు. మొత్తం ఫ్యామిలీ అంతా మురారీ కోసం ఏడుస్తూనే ఉంటారు.

ఇవి కూడా చదవండి

క్షమించండి మీ కొడుకు బతికే ఉన్నాడు..

రేవతి మురారీ అంటూ ఏడుస్తూ.. చూశావా అక్కా మీ కొడుకు మనల్ని ఎంత అన్యాయం చేశాడో అని ఏడుస్తుంటే.. నన్ను క్షమించండి అత్తయ్య మీ కొడుకు బతికే ఉన్నాడు అని ముకుంద తనలో తాను అనుకుంటుంది. ఈ అమ్మని వదిలేసి వెళ్లిపోయావా అని అంటూ రేవతి ఏడుస్తుంది. మురారీ బాడీ కాదని గుర్తు పడతారా అని ముకుంద భయపడుతుంటే.. ఇదేమిటండి ఫోన్ కూడా చెయ్యని మురారీకి ఇలా అయింది అని సుమ బాధపడుతుంది. భవానీ నాన్నా నీ మీద కోపమే నాకు ఇలా శాపం అయిందా అని ఆలోచిస్తుంది. లే నాన్న అంటూ భవానీ మురారీని పిలుస్తుంది. నాకు నీమీద కోపం లేదు నేను నిన్ను క్షమించా .. పెద్దమ్మతో మాట్లాడారా.. ఈ పెద్దమ్మ అంటే చాలా ఇష్టం కదా.. ఈ చేతులతో నిన్ను పెంచారా .. లే ఒక్కసారి మాట్లాడు నాన్నా అని భవానీ ఏడుస్తుంది.

మధుకి ఫోన్ చేసిన ప్రభాకర్ ఏమైంది అని అంటే.. మామయ్య అది అంటూ చాలా ఘోరం జరిగిపోయింది మామయ్య.. మురారీ ఇక లేదు మామయ్య.. ఎందుకు ఇలా జరిగిందని అందరూ మండిపడుతున్నారు.. అని మధు చెబుతాడు.

రేపటి ఎపిసోడ్ లో

చిన్నన్నా ఏసీపీ సార్ ఇక్కడే ఉన్నట్లు నా మనసు చెబుతుంది.. ఇక్కడే ఉన్నారు చిన్నన్నా అని అంటుంటే.. ముకుంద వాళ్ల అన్నయ్య మురారీని కృష్ణ ముందు తీసుకుని వెళ్తాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..